శ్రీలంక నుంచి 41 మంది తమిళ జాలర్ల రాక
తిరువొత్తియూరు: శ్రీలంక నావిక దళం అరెస్టు చేసిన 41 మంది తమిళ జాలర్లు విడుదలై చైన్నె విమానాశ్రయానికి చేరుకున్నారు. రామనాథపురం జిల్లా పాంబన్ ప్రాంతానికి చెందిన 35 మంది జాలర్లు గత ఆగస్టు నెల 9వ తేదీ ఫైబర్ పడవలో సముద్రంలో చేపలు పడుతున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన శ్రీలంక నావికదళ సిబ్బంది సరిహద్దు దాటి చేపలు పడుతున్నట్లు పేర్కొంటూ వారిని అరెస్ట్ చేశారు. అలాగే గత నెల 8వ తేదీ రామనాథపురం జిల్లా అక్క మండపానికి చెందిన ఆరుగురు జాలర్లు సముద్రంలో చేపలు పడుతున్న సమయంలో శ్రీలంక పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అరెస్టయిన 41 మందిని విడుదల చేయుటకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంతో 41 మందిని శ్రీలంక ప్రభుత్వం విడుదల చేశారు. వీరంతా విమానంలో చైన్నెకి వచ్చారు. చైన్నె విమానాశ్రయానికి చేరుకున్న జాలర్లకు మత్స్యశాఖ అధికారులు ఆహ్వానం పలికారు. తర్వాత ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన వాహనాలలో వారి వారి సొంత ఊర్లకు తిరిగి పంపించారు.
నేరాల్లో పోలీసుల ప్రమేయాన్ని తేలికగా తీసుకోలేం
కొరుక్కుపేట: నేరాల్లో పోలీసుల ప్రమేయాన్ని తేలికగా తీసుకోలేం అని మద్రాసు హైకోర్టు అభిప్రాయ పడింది. ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ట్రిప్లికేన్ పోలీస్ స్టేషన్ స్పెషల్ సబ్ ఇన్ స్పెక్టర్ రాజాసింగ్ చైన్నెలోని వన్నార్ పేటకు చెందిన మహ్మద్ గౌస్‌ను కిడ్నాప్ చేసి రూ. 20 లక్షలు దోపిడీకి పాల్పడ్డాడు. దామోదరన్, ప్రదీప్, ప్రభుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సెషన్స్ కోర్టు కొట్టివేసింది. దీంతో రాజాసింగ్, దామోదరన్ బెయిల్ కోరుతూ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జగదీశ్ చంద్ర ధర్మాసనం విచారణ చేపట్టారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. ఈ కేసులో మరో స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్ సన్నీ లాయిడ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నందున బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాలని ప్రభుత్వం కోరింది. దీనిని అంగీకరించిన న్యాయమూర్తి పోలీసు శాఖనే నేరాలకు పాల్పడిన ఈ కేసును సాధారణ కేసుగా పరిగణించలేమంటూ ఈనెల 28కి కేసు విచారణను వాయిదా వేశారు.
ఈడీ విచారణకు
డీఎంకే ఎంపీ కదిర్ ఆనంద్
సాక్షి, చైన్నె : రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దురై మురుగన్ తనయుడు, వేలూరు డీఎంకే ఎంపీ కదిర్ ఆనంద్ బుధవారం చైన్నెలో ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. తమ దాడులలో బయటపడ్డ రూ. 13.7 కోట్ల ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల తదితర వాటితో పాటూ విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఆయన వద్ద అధికారుల బృందం వివరాలు రాబట్టే ప్రయత్నం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దురైమురుగన్ తనయుడు, ఎంపీ కదిర్ ఆనంద్‌కు చెందిన వేలూరులోని కార్యాలయాలు, విద్యా సంస్థలలో ఈడీ సోదాల గురించి తెలిసిందే. ఈ తనిఖీల్లో పట్టుబడ్డ నగదు, ఇతర వివరాలను మంగళవారం ఈడీ వర్గాలు ప్రకటించాయి. వీటి గురించి విచారించేందుకు కదిర్ ఆనంద్‌కు సమన్లు జారీ చేశారు. దీంతో తన న్యాయవాదులతో కలిసి చైన్నె లోని ఈడీ కార్యాలయానికి కదిర్ ఆనంద్ హాజర య్యారు. ఎప్పుడు పిలిచినా వచ్చేందుకు సిద్ధమని అధికారులకు తెలియజేసి పేర్కొన్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment