నయపాక్కంలో వానరాల బెడద
తిరువళ్లూరు: నయపాక్కం గ్రామంలో కోతుల బెదడ పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో వానరాలను పట్టి అటవీ ప్రాంతంలో వదలిపెట్టాలని పలుమార్లు అటవీ శాఖ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరువళ్లూరు జిల్లా పూండిలో కాపు అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతానికి సమీపంలోనే పూండి, నయపాక్కం, నంబాక్కంతో పాటు ఇతర గ్రామాలు వున్నాయి. ఈ క్రమంలో నయపాక్కం గ్రామంలో ఇటీవల కోతుల బెడద పెరిగింది. ఇంట్లో దూరి వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు దారిన వెళ్లే వారిపై సైతం దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఇటీవల అదే గ్రామానికి చెందిన చిన్నపొన్ను(45), విమల(29) ఇటీవల కోతుల దాడిలో గాయపడ్డారు. గ్రామంలోని పాఠశాల, అంగన్‌ంవాడీ కేంద్రాలకూ కోతుల బెడద తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి నయప్కాంలో భారీగా సంచరిస్తున్న కోతులను పట్టి అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment