గోడకు కొట్టి మూడేళ్ల చిన్నారి హత్య
● అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని దారుణం ● బైక్ పై నుంచి పడ్డాడని హై డ్రామా ● ప్రియుడు అరెస్టు ● కసాయి తల్లి కోసం గాలింపు
సేలం: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మూడేళ్ల చిన్నారిని గోడకేసి కొట్టి హత్య చేసిన ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు, బైక్‌పై నుంచి కింద పడ్డాడని హై డ్రామా ఆడినకసాయి తల్లి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వివరాలు.. సేలం గుగై ప్రాంతానికి చెందిన పశుపతి (26) డ్రైవర్. ఇతని భార్య షణ్ముగప్రియా (25). వీరికి వెట్రివేల్ (6), మారన్ (3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ స్థితిలో షణ్ముగప్రియాకు కిచ్చిపాళయం కాలికౌండర్ హౌసింగ్ బోర్డు ప్రాంతానికి చెందిన కూలి కార్మికుడు తమిళరసన్(22)కు మధ్య పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకు వీరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఇద్దరు అప్పుడప్పుడు ఏకాంతంగా గడుపుతూ వచ్చారు. ఈ విషయం తెలుసుక్ను పశుపతి ఇద్దరిని పిలిపించి అక్రమ సంబంధం వదులుకోవాలని ఖండించాడు. అప్పుడు ఏర్పడిన వాగ్వాదంలో ఆవేశం చెందిన తమిళరసన్ కత్తితో పశుపతిని పొడిచాడు. ఆ తర్వాత నుంచి షణ్ముగ ప్రియ పిల్లలతోపాటు తమిళరసన్ వద్దకు వెళ్లి జీవిస్తూ వచ్చింది. ఈ స్థితిలో గత రెండు రోజుల క్రితం బైక్‌పై నుంచి కుమారుడు కింద పడి దెబ్బ తగిలినట్టు సేలం ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లి షణ్ముగ ప్రియ తన బిడ్డను చేర్చింది. అప్పుడు స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న కుమారుడు మారన్‌ను చూసిన బంధంవులు సందేహం వ్యక్తం చేశారు. ఆ మేరకు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ కన్నన్, పోలీసులు తమిళరసన్‌ను పట్టుకుని విచారణ చేపట్టారు. అప్పుడు చిన్నారి మారన్ రాత్రి సమయంలో అప్పుడప్పుడు ఏడుస్తూ వచ్చాడని, అది వారి ఏకాంతానికి భంగం కలిగించడంతో ఆవేశంలో చిన్నారి కాళ్లు పట్టుకుని గోడకు కొట్టినట్టు, చిన్నారి స్పృహ తప్పాడని, దీంతో దిగ్భ్రాంతి చెందిన అక్రమ జంట ఆ చిన్నారి బైక్‌పై నుంచి కింద పడ్డాడని నాటకమాడినట్టు అంగీకరించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన మారన్ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. దీంతో పోలీసులు తమిళరసన్‌పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బైక్ పై నుంచి బిడ్డ కిందపడ్డాడని తెలిపిన తల్లి పరారైంది.
Comments
Please login to add a commentAdd a comment