నల్లజెండాలతో నిరసన
తిరుత్తణి : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం గ్రామసభలు నిర్వహించారు. తిరుత్తణి మున్సిపాలిటీలో కార్తికేయపురం గ్రామ పంచాయతీ విలీనానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలకు నిరసనగా గ్రామస్తులు తమ ఇళ్ల ముందు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. అలాగే గ్రామసభను బహిష్కరించారు. తిరుత్తణి మున్సిపాలిటీలో తమ గ్రామ పంచాయతీ విలీనం రద్దు చేయాలని కోరుతూ వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో బీడీఓ సంతానం పోలీసులు గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో చర్చలు జరిపారు. సభలు నిర్వహించేందుకు అనుమతించమని తెలపడంతో తిరిగి వెళ్లారు.
పళ్లిపట్టులో పట్టణ పంచాయతీలో గ్రామాల విలీనం వద్దు
పళ్లిపట్టు యూనియన్‌లోని 33 గ్రామ పంచాయతీల్లో రిపబ్లిక్ వేడుకల సందర్భంగా గ్రామ సభలు జరిగాయి. రామచంద్రాపురం, సురాజుపట్టడె గ్రామాలను పళ్లిపట్టు టౌన్ పంచాయతీలోని విలీనం చేసే ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ గ్రామసభలో పాల్గొన్న రెండు పంచాయతీల ప్రజలు పట్టణ పంచాయతీలో విలీనానికి వ్యతిరేకంగా వినతిపత్రాలు అందజేశారు.
భార్యను కడతేర్చిన భర్త
సేలం : భార్యను బండరాయితో కొట్టి చంపిన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. నీలగిరి జిల్లా పందలూర్ సమీపంలో ఎరుమాడు వెట్టువాడి పనియర్ గిరిజన కాలనీకి చెందిన మహిళ యశోధ(52)కు ఇదివరకే రెండు వివాహాలు కాగా ఇద్దరూ మృతి చెందారు. వారి ద్వారా యశోధకు పిల్లలు ఉన్నారు. ఈ స్థితిలో యశోధ పాట్టవయల్ కొట్టాడై గ్రామానికి చెందిన చంద్రన్ (50)ను మూడో వివాహం చేసుకుని వెట్టివాడిలో కాపురం చేస్తున్నారు. చంద్రన్ కూడా యశోధ రెండో భార్య. కాగా ఇద్దరి మధ్య శనివారం రాత్రి గొడవ ఏర్పడింది. ఆ సమయంలో చంద్రన్ బండ రాయితో యశోధను కొట్టి చంపాడు. తర్వాత యశోధ మృతదేహాన్ని ఇంటికి సమీపంలోని రోడ్డు పక్కన పడేసి పరారయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment