గ్రామసభలు.. పరిష్కార వేదికలు
వేలూరు : రగామసభల ద్వారానే సమస్యలు పరిష్కారమని కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని జిల్లా కాట్పాడి తాలుకా సేనూరు పంచాయతీలో కలెక్టర్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని వివిధ సమస్యలపై వచ్చిన వినతులను స్వీకరించి వాటిలో కొన్నింటిని అక్కడిక్కడే పరిష్కరించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ప్రతి పంచాయతీలో గ్రామసభ నిర్వహించాలని ఆదేశించడం జరిగిందన్నారు. సమస్యలను ఆయా సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు తెలియజేసి అర్హులైన వారికి పథకాలను అందజేస్తామన్నారు. ప్రస్తుతం సేనూరులో తాగునీటి సమస్యతో పాటు పెన్షన్‌ల కోసం అనేక మంది వినతిపత్రాలు సమర్పించారని వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ గ్రామసభలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదే విధంగా కాట్పాడి తాలుకా అమ్ముండి, పెరుముగై, వంటి పంచాయతీల్లో ఆయా సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. వీటిలో అధికంగా పెన్షన్‌లకు సంబంధించి వినతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment