అలరించిన త్యాగరాజ సంకీర్తనలు
కొరుక్కుపేట : వేద విజ్ఞాన వేదిక, శ్రీవాణి (శ్రీసిటీ వారి సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్థ) సంయుక్త ఆధ్వర్యంలో తరతరాల తెలుగు కవిత ఉపన్యా స ధారావాహికలో భాగంగా ఆదివారం రాత్రి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కుమారి మల్లాది అనూష బృందం వారిచే శ్రీ త్యాగరాజ సంకీర్తనార్చన విభావరి నిర్వహించారు. చైన్నె టీనగర్‌లో ఉన్న ఆస్కా గోదావరి హాలు వేదికగా జరిగిన కార్యక్రమంలో త్యాగరాజ కీర్తనలను శ్రావ్యంగా ఆలపించి అలరించారు. ‘వందనము రఘు నందనా – సేతు బంధన – భక్త చందనా, సామజ వరగమన, ఎందరో మహానుభావులు – అందరికీ వందనములు, రామ కోదండ రామా.. కల్యాణ రామ’ వంటి త్యాగరాజ కీర్తనలను ఆలపించి ఆహూతులను వినూల విందు చేశారు. ఈ సందర్భంగా సంగీత కళాకారులను వేద విజ్ఞాన వేదిక అధ్యక్షులు జేకే రెడ్డి, కార్యదర్శి కందనూరు మధు తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆస్కా అధ్యక్షులు సుబ్బారెడ్డి, శ్రీసిటీ అధినేత రవి సన్నారెడ్డి, తెలుగు ప్రముఖులు, సాహితీవేత్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment