కృష్ణగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
సేలం : కృష్ణగిరి సమీపంలో ఆదివారం వేకువజామున దూసుకెళ్లిన మినీ లారీ ఎదురుగా వస్తున్న టారస్ లారీ, సర జకు వ్యాన్ ఠిజ ఢీకొన్న ప్రమాదంలో మీనీ లారీ డ్రైవర్, టారస్ లారీ డ్రైవర్‌తో పాటూ నలుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బర్గూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. వివరాలు.. మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయల రోడుతో వస్తున్న మినీలారీ ఒకటి చైన్నె కోయంబేడు మార్కెట్‌కు రావడానికి బయలుదేరింది. ఆ లారీని మహారాష్ట్ర పన్తాప్పూర్ ప్రాంతానికి ఎ.చందిన నారాయణన్ (45) నడిపాడు. సోలాపూర్‌కు చెందిన బదామి (40) క్లీనర్‌గా ఉన్నాడు. ఆదివారం వేకువజామున ఈ మినీ లారీ కృష్ణగిరి జిల్లా బర్గూర్ సమీపంలోని అత్తిమరత్తుపల్లం ప్రాంతంలో కృష్ణగిరి – చైన్నె జాతీయ రహదారిపై వస్తున్న సమయంలో అదుపుతప్పి రోడ్డు అవతలివైపు రోడ్డుకు చేరి దూసుకు వెళ్లి, ఎదురుగా ఆంధ్రా నుంచి కేరళకు పశువులను ఎక్కించుకుని వస్తున్న టారస్ లారీను వేగంగా ఢీకొంది. ఈ క్రమంలో దాని వెనుక వస్తున్న సరుకు వ్యాన్ టారస్ లారీను ఢీకొని ప్రమాదానికి గురైంది.
నలుగురు మృత్యువాత..
ఈ ప్రమాదంలో మినీ లారీలో వచ్చిన డ్రైవర్ రాయన్, టారస్ లారీ డ్రైవర్ దిండుగల్‌కు చెందిన అరుళ్ జ్యోతి, మణికంఠన్, నారాయణన్ ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో టారస్ లారీలో వచ్చిన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఖాదర్ (35), విజయ్ (30), రాజేష్ (37)తోపాటూ మహారాష్ట్ర లారీ క్లీనర్ బదామీ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు, సహ వాహన చోదకులు రక్షించిన చికిత్స నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మార్గంమధ్యలోనే బదామీ ప్రాణాలు కోల్పోయాడు.
సహాయక చర్యల్లో అధికారులు
సమాచారం అందుకున్న వెంటనే బర్గూర్ పోలీసులు, అగ్నిమాపక కార్యాలయ అధికారి పళని అధ్యక్షతన సిబ్బంది బాలమురుగన్, కృష్ణమూర్తి, అన్బుమణి, విగ్నేష్, శంకర్, ప్రతాప్, విశ్వనాథ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి డీఎస్పీ ముత్తు కృష్ణన్, పోలీసు ఇన్‌స్పెక్టర్ వళర్మతి, పోలీసులు నేరుగా వెళ్లి పరిశీలించారు. అనంతరం నలుగురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా కృష్ణగిరి – చైన్నె జాతీయ రహదారిపై సుమారు రెండు గంటల పాటూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాద ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
మినీ లారీ– రెండు వాహనాలు ఢీ
నలుగురు దుర్మరణం
ముగ్గురికి తీవ్రగాయాలు
Comments
Please login to add a commentAdd a comment