క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Published Wed, Feb 12 2025 1:09 AM | Last Updated on Wed, Feb 12 2025 1:09 AM

-

అన్నామలై ఆరోపణలపై మంత్రి గాంధీ ఘాటు స్పందన

కొరుక్కుపేట: ఐఏఎస్‌ అధికారి షణ్ముగ సుందరాన్ని చేనేత జౌళి శాఖనుంచి బదిలీ చేయ డాన్ని తప్పుబడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అనేక ఆరోపణలు చేశారు. దీనిపై రాష్ట్ర మంత్రి గాంధీ ఘాటుగా స్పందించారు. ఉచిత పంచెల అమ్మకాలు చేపట్టే పథకంపై వచ్చిన ఆరోపణలు సరైనవి కావన్నారు. ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్‌ నేతృత్వంలో తమ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రతి రంగంలోనూ సక్రమంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా చేనేత పరిశ్రమ అభివృద్ధికి చేనేత కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. 20 మందికి పైగా భారతీయ సివిల్‌ సర్వీస్‌ అధికారుల బదిలీలలో హ్యాండ్లూమ్స్‌ డైరెక్టర్‌ బదిలీ ఒకటని అయితే దీన్ని వక్రీకరించి రాజకీయాలు చేయడం అన్నామలైకు తగదని హితవు పలికారు.

ఫేక్‌ కాల్‌ సెంటర్‌ నడుపుతూ రూ. లక్షల్లో మోసం

నలుగురి అరెస్టు

అన్నానగర్‌: విల్లుపురం జిల్లా ఒలుంధియాంపట్టు గ్రామానికి చెందిన రాజు (45), వడ్రంగి. ఇతడు తనను ఓ వ్యక్తి మోసం చేశాడని విల్లుపురం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాజు సంప్రదించిన ఫోన్‌ నంబర్లను విచారించగా, ఆ నకిలీ నంబర్‌ సెంజి పెరియకరంలోని ప్రైవేటు కాల్‌ సెంటర్‌ ఫోన్‌ నంబర్‌ అని తేలింది. వెంటనే పోలీసులు కాల్‌ సెంటర్‌ కు వెళ్లి సోదాలు చేశారు. అక్కడ మేనేజర్‌గా పనిచేస్తున్న సెంజీ కి చెందిన ఆంథోని భార్య వరమతి (36)ని విచారించగా ఐ.డి.ఎఫ్‌.సి. చైన్నె నెసప్పాక్కం భారతి నగర్‌కు చెందిన వాసు కుమారుడు కుమారుడు గోపీకృష్ణన్‌(36) అనే నకిలీ కాల్‌ సెంటర్‌లో మేనేజర్‌ గా పనిచేస్తున్నాడని, అతని కింద 10 మందికి పైగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. తదుపరి విచారణలో ఆన్‌లైన్‌ ద్వారా రుణాలు కోరుతున్న వ్యక్తుల ఫోన్‌ నంబర్లు సేకరించి పలు లక్షల మోసాలకు పాల్పడినట్లు తేలింది. తదనంతరం, పోలీసులు వరమతి, గోపీకృష్ణన్‌, వారి సహచరులు, చైన్నె అత్తిపట్టు అంబేద్కర్‌ నగర్‌కు చెందిన త్యాగరాజన్‌ కుమారుడు దినేష్‌ (28), కడలూరు జిల్లా నేవేలి ఆర్చ్‌గేట్‌ గాంధీ గ్రామానికి చెందిన ఆరుముగం కుమారుడు నటరాజన్‌ (39)ను అరెస్టు చేశారు.

తండ్రిని బెదిరించే క్రమంలో..

పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు మృతి

అన్నానగర్‌: తనకు బైక్‌ కొనివ్వాలంటూ తండ్రిని బెదిరించే క్రమంలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న ఓ యువకుడు అనూహ్యంగా మంటలు చెలరేగడంతో కాలిపోయి మృతి చెందాడు. వివరాలు.. చైన్నెలోని నెర్‌ కుండ్రంకు చెందిన మురుగన్‌ నిర్మాణ వ్యర్థాలను గ్రేడింగ్‌ చేసే పనిలో ఉన్నాడు. ఇతని కుమారుడు జీవా (19). ఇతను తన తండ్రికి సహాయంగా పని చేస్తున్నాడు. తనకు బైకు కొనివ్వమని జీవా తన తండ్రిని కోరాడు. అయితే ఆయన నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన జీవా సోమవారం రాత్రి తాను పనిచేస్తున్న మేట్టుకుప్పం రోడ్డు, మధుర గేట్‌లోని మురుగన్‌ షెడ్డు వద్దకు వెళ్లి అక్కడ పార్క్‌ చేసిన ద్విచక్ర వాహనంలో పెట్రోల్‌ తీసి బైకు కొనివ్వకపోతే పెట్రోల్‌ పోసి తగులబెట్టుకుంటాను అంటూ తండ్రిని బెదిరించాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని చలి కోసం పెట్టిన నిప్పుల దగ్గర నిలబడి మంటల్లో దిగుతానని మళ్లీ తండ్రిని బెదిరించాడు. అప్పుడు అనుకోని విధంగా జీవా శరీరానికి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. స్థానికులు అతనిని రక్షించి కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడ చికిత్స అందక జీవా మంగళవారం మృతి చెందాడు. మధురవాయల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆత్మహత్య

సేలం : కన్యాకుమారి జిల్లా తక్కలై సమీపంలో ఉన్న ములకుమూడు ప్రాంతానికి చెందిన స్టీఫన్‌ అరుళ్‌రాజ్‌ (56). ఇతను నాగర్‌కోవిల్‌ ట్రాఫిక్‌ పోలీసు శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు గత కొన్ని రోజుల క్రితం వెరికోస్‌ వ్యాధికి గురైయ్యాడు. దీంతో స్టీఫన్‌ అరుల్‌రాజ్‌ కాళ్ల నొప్పులతో బాధపడుతూ వచ్చాడు. ఈ స్థితిలో ఆయన గత డిసెంబర్‌ నెల 24వ తేది నుంచి చికిత్స నిమిత్తం సెలవు తీసుకుని ఇంట్లోనే ఉంటున్నారు. కాగా ఈ నెల 19వ తేది మళ్లీ విధులకు వెళ్లాల్సి ఉంది. ఈ స్థితిలో సోమవారం రాత్రి ఇంటిలో అందరూ నిద్రపోయిన స్థితిలో ఇంటి వెనుక వైపు ఉన్న తోటలోకి వెళ్లి అక్కడ ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం ఆయన భార్య వయోలా తోటలోకి వచ్చిన సమయంలో చెట్టుకు భర్త మృతదేహంగా వేలాడుతుండడం చూసి దిగ్భ్రాంతి చెందింది. ఆమె కేకలు విని అక్కడికి చేరుకున్న కుటుంబీకులు ఉరిపై నుంచి అరుళ్‌రాజ్‌ను కిందికి దించి హుటాహుటి తక్కలై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే అరుళ్‌ రాజ్‌ మృతి చెందినట్టు తెలిపారు.

ప్రియురాలి తల్లిని గొంతు నులిమి చంపిన యువకుడు

అన్నానగర్‌: చైన్నె ముగప్పెర్‌లోని ఈస్ట్‌ చర్చి రోడ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో మైథిలి(60) నివా సం ఉండేవారు. తన భర్త నుండి విడిపోయి జీవిస్తోంది. ఈమె కూతురు రితిక(26). ఈమె పోరూ ర్‌ లోని కంపెనీలో పనిచేస్తో్‌ంది. ఈ స్థితిలో రితిక శ్యామ్‌(28) అనే యువకుడి తో ప్రేమలో ఉంది. ఇద్దరూ నిత్యం బయట ఊరు తిరిగేవారు. దీన్ని తల్లి మైథిలి ఖండించారు. ఈ విషయంపై సోమ వారం తల్లీకూతుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో కోపోద్రిక్తులైన రితికా తన ప్రియుడు శ్యామ్‌కు ఫోన్‌ చేసి ఇంటికి పిలిచింది. దీంతో కోపోద్రిక్తుడైన శ్యామ్‌ ప్రియు రాలి ఎదుటే గొంతు నులిమి చంపేశాడు. అప్పు డు శ్యామ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. జేజే నగర్‌ పోలీసులు శ్యామ్‌ను అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement