![విజయ్‌కు ప్రశాంత్ సహకారం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11cni30-600560_mr-1739302549-0.jpg.webp?itok=F24gSVLN)
విజయ్‌కు ప్రశాంత్ సహకారం
● రెండో రోజూ సుదీర్ఘ భేటీ ● టీవీకేలో 28 అనుబంధ విభాగాలు
సాక్షి, చైన్నె : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తమిళగ వెట్రికళగంకు వ్యూహ రచనలు చేయబోతున్నారు. ఆయన బృందం సమన్వయంతో తమిళగ వెట్రి కళగం ముందుకెళ్లబోతున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో తమిళగ వెట్రి కళగం(టీవీకే)లో 28 అనుబంధ విభాగాల ఏర్పాటుకు నిర్ణయించడం గమనార్హం. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం అంటూ రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టిన విజయ్ ప్రజలలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. పార్టీ పరంగా 120 జిల్లాలను ఏర్పాటు చేసి, కమిటీలకు నిర్వాహకులను ప్రకటించే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే కాకుండా, ప్రజలతో మమేకం కావడం, వారికి కావాల్సిన సంక్షేమం,అ భివృద్ధికి తోడ్పాటు అందించే దిశగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహకారం తీసుకునేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సోమవారం తిరువాన్మీయూరులోని పార్టీ కార్యాలయంలో ప్రశాంత్ కిషోర్, విజయ్ మధ్య సుమారు మూడు గంటల పాటూ భేటీ జరిగింది. దీనికి కొనసాగింపుగా మంగళవారం కూడా సుదీర్ఘ సమాలోచన జరగడం గమనార్హం. అయితే రెండో రోజు భేటీలో విజయ్ లేరు. పార్టీ నేత ఆదవ్ అర్జున నివాసంలో ఈ భేటీ జరిగింది. ఇందులో ప్రశాంత్ కిషోర్, తమిళగ వెట్రి కళగం నేతలు భుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున, ఆరోగ్య స్వామి మాత్రమే కొన్ని గంటల పాటూ సమాలోచనలో మునిగారు. రాష్ట్రంలోని కీలక పార్టీలు, వాటి ఓటు బ్యాంక్, ఇప్పటి వరకు ఆ పార్టీల రూపంలో అమలైన పథకాలు, ప్రజాహిత కార్యక్రమాలు వంటి అంశాలపై వివరాలను సేకరించే విధంగా ప్రశాంత్ కిషోర్ సమాలోచనలో మునిగినట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశంలో విజయ్‌కు సహకారంగా రంగంలోకి దిగేందుకు ప్రశాంత్ సిద్ధమైనట్టు సమాచారాలు వెలువడ్డాయి. త్వరలో అధికారిక ఒప్పందంలతో ప్రశాంత్ టీం తమిళనాడులో రంగంలోకి దిగనున్నట్టు చెబుతున్నారు. ఈ భేటి ఓ వైపు జరుగుతోంటే, మరో వైపు తమిళగ వెట్రి కళగం నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వెళ్లిన ఓ లేఖ వెలుగులోకి వచ్చింది
28 అనుబంధ విభాగాలు
పార్టీలో 120 జిల్లాల ఏర్పాటుతో పాటూ అనుబంధంగా ఏకంగా 28 విభాగాల ఏర్పాటుకు విజయ్ నిర్ణయించడం విశేషం. ఈ వివరాలతో కూడిన లేఖ మంగళవారం వెలుగులోకి వచ్చింది. హిజ్రాల కోసం, చిల్డ్రన్స్ కోసం, పర్యావరణ పరిరక్షణ, పరిశోధన కోసం ప్రత్యే క విభాగాలు ఏర్పాటు కానున్నడం గమనార్హం. యువజన, విద్యార్థి, మహిళ, యువతులు, ప్రచార, రిటైర్డ్ ఉద్యోగులు, కార్మిక, వర్తక, మ త్స్య, సమాచార, న్యాయవాద, సభ్యత్వ న మోదు, దివ్యాంగులు తదితర 28 విభాగాలను పార్టీకి అనుబంధంగా ఏర్పాటు చేయనున్నడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment