![ఘనంగా తిరుమల నాయకర్ 442వ జయంతి వేడుకలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11cni33-300107_mr-1739302549-0.jpg.webp?itok=A0t2HOSz)
ఘనంగా తిరుమల నాయకర్ 442వ జయంతి వేడుకలు
కొరుక్కుపేట: మధురైని పరిపాలించిన తిరుమల నాయకర్ 442 వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. అలాగే అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్) ఆధ్వర్యంలో చైన్నె కీల్పాకంలోని సమాఖ్య ప్రధాన కార్యాలయంలో ఏఐటీఎఫ్ అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి అధ్యక్షతన తిరుమల నాయకర్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వివిధ తెలుగు సంఘాల నాయకులతో కలిసి డాక్టర్ సీఎంకే రెడ్డి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ ఆంగ్లేయుల పాలనలో దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన రాజులలో తెలుగువారైన తిరుమల నాయకర్ ప్రజలకు మంచి పాలన అందించడంతోపాటూ అనేక దేవాలయాలను నిర్మించారని గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధికి తిరుమల నాయకర్ సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. రాష్ట్రంలో క్రమంగా కనుమరుగవుతున్న తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో తెలుగు కుటుంబాలు, ఉపాధ్యాయులు పాత్ర చాలా కీలకం అని అభిప్రాయ పడ్డారు. మాతృభాషలో చదివించుకోకపోతే భవిష్యత్తులో భాష కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుభాషను బతికించుకునేందుకు తెలుగువారంతా ఐక్యతతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో తమిళనాడు బీజేపీకి చెందిన సుమతి వెంకటేశన్, జి.భాస్కర్ , బి.మహేష్ పాల్గొడనం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ జయంతి వేడుకల్లో ఈ ఏఐటిఎఫ్ ఉపాధ్యక్షులు సీఎం కిషోర్, గొల్లపల్లి ఇజ్రాయిల్, ప్రధాన కార్యదర్శి నాయకర్ ఆర్. నందగోపాల్, కోశాధికారి కేవీ జనార్ధనం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment