తమిళసినిమా: అససి క్రియేషన్స్ పతాకంపై అముద లియోని నిర్మిస్తున్న డెలివరీ బాయ్ చిత్రం మంగళవారం చైన్నెలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ప్రముఖ వ్యాఖ్యాత దిండిగల్ లియోని వారసుడు లియో శివకుమార్. కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా నటి బ్రిగిడ సాగ నటిస్తున్నారు. దర్శకుడు సుశీంద్రన్ శిష్యుడు నాని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటి రాధిక శరత్ కుమార్, బోస్ వెంకట్, కాళీ వెంకట్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాల్లో నిర్మాత కలైపులి ఎస్.థాను ముఖ్యఅతిథిగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. డెలివరీ బాయ్ ఎమోషనల్‌తో కూడిన యాక్షన్ డ్రామా కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయన్నారు . పలు ఆసక్తికరమైన అంత్యలతో కూడిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా కథానాయకుడు లియో సుకుమార్‌కు ఇది టైలర్ మేడ్ చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో నటించే ఇతర నటినటులు,సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment