తమిళసినిమా: ఇంతకుముందు విజయ్ హీరోగా మాస్టర్, లియో, విక్రమ్ కథానాయకుడుగా మహాన్, విజయ్ సేతుపతి నయనతార సమంత హీరో హీరోయిన్లుగా కాత్తు వాక్కుల రెండు కాదల్, వంటి కమర్షియల్ హిట్ చిత్రాలను నిర్మించిన ఎస్‌ఎస్ లలిత్ కుమార్ తాజాగా తన సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కథా నాయకుడిగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాలను నిర్మిస్తున్నారు. కాగా తాజాగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇందులో నటుడు విక్రమ్ ప్రభును హీరోగా నటిస్తున్నారు. ఆయనతోపాటు తన వారసుడు ఎల్కే .అక్షయ్ కుమార్‌ను నటుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సురేష్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు వెట్రిమారన్ శిష్యుడన్నది. ఈ చిత్రం మంగళవారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన సురేష్ పేర్కొంటూ ప్రతిభ శ్రమ, అంకితభావం ఉన్నవారికి ఖచ్చితంగా కోలీవుడ్ కార్బెట్‌తో స్వాగతం పలుకుతుందని ఆ విధంగా ఎల్కే అక్షయ్ కుమార్ అంకితభావం తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఇది యదార్ధ ఘటన ఇతివృత్తంతో రూపొందిస్తున్న కథాచిత్రమని చెప్పారు. దీనికి నటుడు, దర్శకుడు డానాకారన్ చిత్రం ఫ్రేమ్ తమిళ్ కథను అందించినట్లు చెప్పారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని ,మాదేశ్ మాణిక్యం చాయాగ్రహణంను అందిస్తున్న ఈ చిత్రంలో నటించే ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment