ప్రత్యేక విమానంలో హస్తినకు..
నేడు వెళ్లనున్న డిప్యూటీ సీఎం భట్టి
అధిష్టానం పెద్దలతో భేటీ కోసమే అంటున్న గాంధీ భవన్ వర్గాలు
పీసీసీ చీఫ్ ఎంపిక, నామినేటెడ్ పోస్టుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హస్తిన బాటపట్టారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీతో కలిసి గురువారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లారు. అలాగే ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు.
వారంతా శుక్రవారం ఉదయం ఏఐ సీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో సమావేశం అవుతారని గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఏఐసీసీ సంస్థాగత మార్పుల్లో భా గంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మార్పు, పీసీసీ అధ్యక్ష నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీతోపాటు మంత్రివర్గ విస్తరణపై వారు చర్చి స్తారని చెబుతున్నాయి.
ఈసారైనా లెక్క తేలుతుందా?
పీసీసీ అధ్యక్ష వ్యవహారం ఈసారైనా కొలిక్కి వస్తుందా అనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగు తోంది. సీఎం హోదాతోపాటు పీసీసీ చీఫ్‌గా గత 8 నెలలుగా రేవంత్‌రెడ్డి కొనసాగు తున్నారు. ఆయన స్థానంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతల్లో ఒకరిని నియ మించాలని అధిష్టానం భావిస్తోంది. గత నాలు గైదు దఫాలుగా అధిష్టానం పెద్దలతో జరిగిన చర్చల్లోనూ ఇదే కోణంలో చర్చ జరిగింది. బీసీ కోటాలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎస్సీ కోటాలో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎస్టీ కోటాలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్‌ల పేర్లు వినిపించాయి.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాదిగ సామాజిక వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారనే చర్చ ఊపందుకుంది. ఈ కోణంలో మానకొండూరు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన పేరును మంత్రి శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి ప్రతిపాదిస్తున్నారని, దక్షిణ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో ఉత్తర తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్ష హోదా ఇవ్వాలని... అదే సమయంలో ఎస్సీ మాదిగ సామాజికవర్గం కూడా కలిసి వస్తుందనే కోణంలో ఈ ప్రతిపాదన చేశారు.
అయితే ఇటీవల మరో పేరు తెరపైకి వచ్చింది. ఉత్తర తెలంగాణ నుంచి కేబినెట్‌లో కీలకపాత్ర పోషిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబును పీసీసీ చీఫ్‌గా నియమిస్తున్నారనే చర్చ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో టీ కాంగ్రెస్ నేతల భేటీలో అయినా పీసీసీ అధ్యక్ష వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.
సీఎం సోదరుని కుమార్తె నిశ్చితార్థానికి ప్రముఖులు
హైదరాబాద్ నార్సింగ్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు అయిన జగదీశ్‌రెడ్డి కుమార్తె రుత్విక – అభిజిత్‌రెడ్డిల నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖులంతా హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment