సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువు కోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దని.. విద్యార్థులు లేరంటూ మూసివేసిన అన్ని బడులను తెరిపించాలి. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకోండి..’’అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని సూచించారు. శనివారం సచివాలయంలో విద్యాశాఖపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పాఠశాల లేని గ్రామ పంచాయతీ ఉండొద్దని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎంత మారుమూల గ్రామమైనా, తండా అయినా కూడా తప్పకుండా ప్రభుత్వ పాఠశాల ఉండాలని.. పట్టణాలు, నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి రానీయొద్దని సూచించారు. విద్యార్థులు లేరనే నెపంతో పాఠశాలలు మూతపడొద్దన్నారు.
ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలి
మన ఊరు, మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. ఆ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తిచేసి, రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని సూచించారు. సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) నిధులతో మన ఊరు–మన బడి కింద ఖర్చు చేసిన నిధులకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాంట్రాక్టుల్లో అవినీతి జరిగిందనే ఫిర్యాదుల నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు. ఇక ఉపాధ్యాయుల పదోన్నతులు. బదిలీలలో ఉన్న అవాంతరాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
బదిలీల విషయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని.. అవాంతరాలను అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. విద్యా సంస్థల విద్యుత్ బిల్లుల కేటగిరీ మార్పునకు తీసుకోవాల్సిన చర్యలపైనా అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరీ కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙంచాలన్నారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుధ్య కారి్మకులను ఏర్పాటు చేయడానికి ఉన్న మార్గాలను సూచించాలని కోరారు.
ఉమ్మడి జిల్లాకో నైపుణ్య విశ్వవిద్యాలయంం
రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్యాలు సాధించి, ఉద్యోగాలు పొందగలిగేలా ఈ స్కిల్ యూనివర్సిటీలు ఉండాలని అధికారులకు సూచించారు. వాటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాల, దీర్ఘకాల కోర్సులను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ఈ విషయంలో గుజరాత్, హరియాణా, రాజస్థాన్, ఒడిశా, ఏపీ తదితర రాష్ట్రాల్లో ఉన్న స్కిల్ యూనివర్సిటీలపై అధ్యయనం చేయాలని సూచించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంతోపాటు తొమ్మిది జిల్లాల్లో ఈ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ అంశంపై విద్యాశాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి తగిన ప్రతిపాదనలను సమరి్పంచాలని సీఎస్‌ను ఆదేశించారు. సీఎం సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్య కమిషనర్ దేవసేన, సీఎంవో అధికారులు శేషాద్రి, షానవాజ్ కాశీం తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు యూనివర్సిటీలపై విచారణ!
రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది వంటి అన్ని అంశాలపై పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సరైన మౌలిక వసతులు, అర్హతలున్న సిబ్బంది లేకుండానే ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామని ప్రైవేటు వర్సిటీలు ఎలా చెప్తున్నాయో పరిశీలించాలన్నారు.
ఇండ్ల ప్లాట్ల కింద రిజిస్ట్రేషన్లు అయిన భూములను, ధరణిలో వివాదంలో ఉన్న భూముల్లో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చారని.. దీనివల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపైనా సమగ్ర నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీకి అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఒక కాలేజీ వల్ల గత విద్యాసంవత్సరంలో చాలామంది విద్యార్థులు ఇబ్బందిపడ్డారని గుర్తు చేశారు.
రిజర్వేషన్ల అమలు పరిశీలన
రాజ్యాంగబద్ధమైన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు నడవడం సరికాదని విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రైవేటు వర్సిటీల్లో రిజర్వేషన్ల అమలు కోసం అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
కాగా ఉన్నత విద్యా మండలి ప్రక్షాళన అంశంపైనా సమీక్షలో చర్చ జరిగినట్టు సమాచారం. అయితే ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణలను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచి్చనా.. తిరిగి వారిని సమావేశానికి ఆహా్వనించడం చర్చనీయాంశంగా మారింది.
త్వరలో మెగా డీఎస్సీ
Published Sun, Dec 31 2023 4:06 AM | Last Updated on Sun, Dec 31 2023 4:18 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment