సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న నూతన సచివాలయ భవన నిర్మాణ ప్రాజెక్టుకు కేంద్ర అటవీశాఖ పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. పాత సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లో దశాబ్దాలుగా ఉన్న చెట్లకు ఎలాంటి నష్టం కలిగించబోమని, కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణానికి అడ్డుగా ఉన్న 27 వృక్షాలను ట్రాన్స్‌లొకేట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదిక ప్రాతిపదికన ఈ అనుమతి ఇచ్చింది.
పాత సెక్రటేరియట్ ఆవరణలో మొత్తం 607 చెట్లు ఉన్నాయని, వాటిలో ఒక్క చెట్టునూ తొలగించట్లేదని ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. మొత్తం వృక్షాల్లో అంతరించిపోయే రకానికి చెందినవేవీ లేవని అందులో వివరించింది. కొత్త సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్న ప్రాంతంలో (పాత సెక్రటేరియట్ ప్రాంగణంలో) మర్రి, రావి, చింత, వేప, అశోక, కానుగ,తదితర వృక్ష రకాలు గుల్‌మొహర్, పొగడ, బాదం, అల్లనేరేడు వంటి చెట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment