సాక్షి, హైదరాబాద్ : రాష్ర్టంలో ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్‌దే గెలుపని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలబడే పార్టీ టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు ఒక్కో రాష్ర్టంలో ఒక్కో ఎజెండా ఉంటుందని, కానీ టీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఒకటే అజెండా ఉంటుందని తెలిపారు. రాష్ర్టంలో ఏ ఎన్నిక జరిగినా గెలిచేది టీఆర్ఎస్ అని, ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రతి పక్షపార్టీ నేతలు కళ్ళు తెరవటం లేదన్నారు. మేమే గెలుస్తున్నామని ఊకదంపుడు ఉపన్యాసాలు సోషల్ మీడియాలో చేస్తున్నారని ధ్వజమెత్తారు.
'కేంద్రానికి ఈ ఆరేళ్లలో పన్నుల రూపంలో.2 లక్షల72 వేల కోట్లు ఇచ్చాం కానీ కేంద్రం నుంచి రాష్ర్టానికి మాత్రం లక్ష కోట్లు మాత్రమే అందాయి. బీజేపీ నేతలు మాత్రం రాష్ట్రంలో.ఇచ్చే నిధులు మొత్తం మావే అంటారు. ఎలక్షన్‌లో పట్టుబడిన పైసలు మాత్రం మావి కాదు అంటారు. నోట్ల రద్దు ,రైతులు వద్దు, కానీ.కార్పొరేట్ ముద్దు అనేది బీజేపీ ఎజెండా. శ్రీలంక,బంగ్లాదేశ్‌తో పోలిస్తే మన దేశ జీడీపీ మాత్రం తగ్గింది. మాటలు మాత్రమే చెప్తారు. నల్లధనం తెస్తాం..15 లక్షలు వేస్తాం అన్నారు..నల్లధనం తేలేదు కానీ నల్ల రైతు చట్టాలు తెచ్చారు..వలస కార్మికులను ఆదుకోలేదు' అని పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి బలమైన నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, మతం పేరుతో మతం పేరుతో ప్రజల్లో చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. (ఉద్రిక్తత..పలువురు బీజేపీ నేతల అరెస్ట్ )
Comments
Please login to add a commentAdd a comment