నేటి నుంచి ఎస్వీయూలో యూత్‌ ఫెస్టివల్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎస్వీయూలో యూత్‌ ఫెస్టివల్‌

Published Fri, Nov 8 2024 2:05 AM | Last Updated on Fri, Nov 8 2024 2:05 AM

నేటి

నేటి నుంచి ఎస్వీయూలో యూత్‌ ఫెస్టివల్‌

హాజరు కానున్న 30 కళాశాల విద్యార్థులు

తిరుపతి సిటీ: ఎస్వీయూలో యువతరంగ్‌–24 పేరుతో మూడు రోజుల పాటు జరిగే ఇంటర్‌ కాలేజ్‌గేట్‌ యూత్‌ ఫెస్టివల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. వర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో శుక్రవారం ప్రారంభంకానున్న యూత్‌ ఫెస్టివల్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ సందర్భంగా వీసీ సీహెచ్‌ అప్పారావు మీడియాతో మాట్లాడుతూ వర్సిటీ పరిధిలోని సుమారు 30 కళాశాల నుంచి విద్యార్థులు యూత్‌ ఫెస్టివల్‌లో పాల్గొననున్నట్టు వెల్లడించారు. ఐదు విభాగాల్లో జరిగే యువజనోత్సవాలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులు చైన్నె ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ వేదికగా జరిగే సౌత్‌జోన్‌ పోటీలలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. అందులోనూ ప్రతిభ చూపిన విద్యార్థులకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొంటారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 300మంది విద్యార్థులు యూత్‌ ఫెస్టివల్‌లో పాల్గొనున్నట్టు తెలిపారు. అనంతరం యూత్‌ ఫెస్టివల్‌ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. రిజిస్ట్రార్‌ భూపతినాయుడు, ప్రొఫెసర్‌ దామోదర్‌రెడ్డి, ప్రసాద్‌, ఆర్గనైజర్లు డాక్టర్‌ జే.కళ్యాణ్‌కుమార్‌, డాక్టర్‌ పత్తిపాటివివేక్‌ పాల్గొన్నారు.

నాలుగు నెలలకు ఒక ఉచిత సిలిండర్‌

తిరుపతి అర్బన్‌: నాలుగు నెలలకు ఒకసారి మాత్రమే దీపం–2 పథకం ద్వారా ఉచిత సిలిండర్‌ వర్తిస్తుందని జేసీ శుభం బన్సల్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో మూడు సిలిండర్లు మాత్రమే ఉచితంగా అందుతాయన్నారు. లబ్ధిదారులు సిలిండర్‌ బుకింగ్‌ అనంతరం నగదు చెల్లించాలని చెప్పారు. తర్వాత 48 గంటల్లోపు మీ బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ చేస్తారని వెల్లడించారు. ఏడాదిలో నాలుగు నెలలకు ఒకటి చొప్పున మూడు ఉచిత సిలిండర్లు పొందడానికి ప్రధానంగా ఆధార్‌ కార్డుతోపాటు తెల్లరేషన్‌కార్డు, బ్యాంక్‌ పుస్తకం, ఎల్‌పీజీ కనెక్షన్‌ ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 6.03 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయన్నారు. ఏదైనా సమస్యలుంటే 1967కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఈకేవైసీ చేయించుకోవడానికి లబ్ధిదారులు గ్యాస్‌ ఏజెన్సీల వద్దకు వెళితే వారు బలవంతంగా గ్యాస్‌ పైపులు, రెగ్యూలేటర్‌, స్టౌ తదితర వస్తువులు కట్టబెట్టి నగదు వసూలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి శేషాచలం రాజు పాల్గొన్నారు.

తిరుమలలో

నలభై బయోగ్యాస్‌ ప్లాంట్లు

తిరుపతి మంగళం: తిరుమలలో నలభై టీపీడీ బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సుస్థిర ఇంధనం కోసం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌), టీటీడీ చేతులు కలిపాయి. వీరి సంయుక్త ఆధ్వర్యంలో స్థిరమైన శక్తి ఉత్పత్తి, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు తిరుమలలో బయోగ్యాస్‌ ప్లాంట్‌కు భూమి పూజ, శంకుస్థాపన చేపట్టారు. కార్యక్రమంలో ఐఆర్‌ఎస్‌, టీటీడీ అడిషనల్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ సీ.వెంకయ్యచౌదరి, (ఐఓసీఎల్‌ హైదరాబాద్‌), ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌, స్టేట్‌ హెడ్‌ బీ.అనిల్‌కుమార్‌, ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, డైరెక్టర్‌–మార్కెటింగ్‌ వీ.సతీష్‌కుమార్‌ టీటీడీకి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో కొత్త ఐఓసీఎల్‌ డివిజనల్‌ కార్యాలయ భవనానికి గురువారం భూమి పూజ చేశారు. తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ మౌర్య, తుడా వీసీ, టీటీడీ, ఐఓసీఎల్‌ అధికారులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 9 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 17 కంపార్ట్‌మెంట్లు నిండాయి. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 9 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
నేటి నుంచి ఎస్వీయూలో యూత్‌ ఫెస్టివల్‌ 
1
1/2

నేటి నుంచి ఎస్వీయూలో యూత్‌ ఫెస్టివల్‌

నేటి నుంచి ఎస్వీయూలో యూత్‌ ఫెస్టివల్‌ 
2
2/2

నేటి నుంచి ఎస్వీయూలో యూత్‌ ఫెస్టివల్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement