కొత్త పింఛన్ల కోసం వ్యథ
కొత్త పింఛన్లు ఇవ్వకపోగా కక్షసాధింపులో భాగంగా ఉన్న పింఛన్లను తొలగించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
తీరంలో
భారీ వర్షం
వాకాడు : వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా మండలంలో భారీ వర్షం పడుతోంది. వాకాడు మండలం, తూపిలిపాళెం సముద్ర తీరంలో గురువారం భారీ వర్షంతోపాటు చలి గాలులు వీశాయి. ఫలితంగా సముద్రంలో అలల ఉధృతి క్రమేణీ పెరిగింది. సముద్ర తీరంలో ఉదయం కనిపించిన అలల తీవ్రత కన్నా సాయంత్రం మరింత పెరిగాయని స్థానిక మత్స్యకారులు తెలిపారు. అధికారుల నుంచి తమకు ఎలాంటి సమాచారం లేకున్నా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని ముందుస్తు జాగ్రత్తగా గ్రామ పెద్దల ఆదేశాలతో వేట నిలిపేసినట్టు వెల్లడించారు.
నేటి నుంచి జాతీయ సదస్సు
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ, భావనా ప్రియ సాహితీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు వర్సిటీలోని చెలికాని అన్నారావు సభా మందిరంలో తెలుగు సాహిత్యం, రచనలు, ఆవిష్కరణలు, అష్టావధానం వంటి విషయాలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఆసక్తిగల సాహితీ ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
రొయ్యల కంపెనీపై ఐటీ దాడులు
కోట: మండలంలోని ఓ రొయ్యల కంపెనీపై ఐటీ శాఖ గురువారం దాడులు నిర్వహించింది. రొయ్యల కంపెనీ ఏర్పాటు చేసిన సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచ్‌లు ఉన్నాయి. 11 చోట్ల ఏకకాలంలో దాడులు చేపట్టినట్లు సమాచారం. ఐటీ దాడులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఎవరూ బయటకు రానీయకుండా జాగ్రత్తపడ్డారు.
– 8లో
Comments
Please login to add a commentAdd a comment