No Headline
తిరుపతి సిటీ: ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థినులు పశువైద్య విద్యపై మక్కువ చూపుతున్నారు. తిరుపతి ఎస్వీ వెటర్నరీ వర్సిటీలోని పశువైద్య కళాశాలలో ప్రతి ఏటా బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కోర్సులలో అధిక సంఖ్యలో అడ్మిషన్లు పొందుతున్నారు. 2010వరకు వెటర్నరీ డాక్టర్లు, పశువైద్య విద్యను అభ్యసించే వారిలో పురుషులు అధిక సంఖ్యలో ఉండేవారు. 2011 నుంచి వెటర్నరీ కోర్సులలో మహిళలు పెద్ద సంఖ్యలో ప్రవేశాలు పొందుతూ వస్తున్నారు. కోర్సు పూర్తి చేసి, దేశవిదేశాలలో వెటర్నరీ డాక్టర్లుగాను, పరిశోధక వృత్తుల్లోనూ, అధ్యాపకులుగా స్థిరపడుతున్నారు.
మహానేత పుణ్యం.. మహిళలకు వరం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2006లో శ్రీ వేంకటేశ్వరా వెటర్నరీ యూనివర్సిటీని నెలకొల్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పశువైద్యకోర్సులు ప్రవేశపెట్టారు. దీంతో ఒక్కసారిగా వెటర్నరీ వైద్య విద్యకు డిమాండ్ పెరిగింది. ప్రవేశాల కోసం తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. నీట్ పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల మెరిట్ ఆధారంగా ఇందులో ప్రవేశాలు కల్పిస్తారు.
ఏటా 85 సీట్లు భర్తీ
ఎస్వీ వెటర్నరీ కళాశాలలో ఏటా కొత్తగా 85 సీట్లను భర్తీ చేస్తున్నారు. ఇందులో సుమారు 50 నుంచి 60 మంది విద్యార్థినులే బీవీఎస్సీలో ప్రవేశాలు పొందుతున్నారు. మూగ జీవులకు సేవ చేయాలనే తమ కలను నెరవేర్చుకుంటున్నారు. పురుషులతో పోటీపడి పశువైద్య రంగంలో రాణిస్తున్నారు. కోర్సు పూర్తయ్యాక కొందరు సొంతంగా క్లినిక్‌లు నడుపుతుండగా.. మరికొందరు విదేశాల్లో స్థిరపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment