పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
● సీపీఐ ఆధ్వర్యంలో 18న సచివాలయాల వద్ద ఆందోళన
తిరుపతి కల్చరల్: ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు పేదలకు గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు, వాటి నిర్మాణానికి రూ.5 లక్షల వరకు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని వెంటనే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పీ.హరినాథరెడ్డి డిమాండ్ చేశారు. బైరాగిపట్టెడలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం సీపీఐ తిరుపతి జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చాలన్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సిమెంట్, ఇసుక, ఇనుము, ఇటుక, కంకర ఉచితంగా సరఫరా చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ ఇళ్ల స్థలాల మంజూరు కోసం ఈనెల 18న అన్ని సచివాలయాల ఎదుట నిరసన చేపట్టనున్నట్టు తెలిపారు. అలాగే రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 26న కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. సీపీఐ నేతలు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, చిన్నరాజు, సుధాకర్‌రెడ్డి, గురవయ్య,బాలక్రిష్ణ, కత్తిరవి, ఉదయ్‌కుమార్, నిదియా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment