సాక్షి మ్యాథ్స్‌బీ.. స్పెల్‌బీకి విశేష స్పందన
● నాలుగు కేటగిరీల్లో రౌండ్–2 పరీక్ష
తిరుపతి ఎడ్యుకేషన్ : సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి వేదికగా మ్యాథ్స్‌బీ సెమీ ఫైనల్, స్పెల్‌బీ రౌండ్–2 పోటీ పరీక్షలు నిర్వహించారు. ఇదివరకు పాఠశాల స్థాయిలో నిర్వహించిన మ్యాథ్స్‌బీ, స్పెల్‌బీలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు రౌండ్–2 పరీక్షలను జీవకోనలోని విశ్వం విద్యాసంస్థలో చేపట్టారు. తిరుపతి, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఆయా పాఠశాలల యాజమాన్యంతో కలిసి పరీక్షలకు ఉత్సాహంగా హాజరయ్యారు.
విద్యార్థులకు ప్రోత్సాహం
ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించేందుకు గణితం, ఆంగ్లం ఈ రెండింటిపై పట్టు తప్పనిసరి. గణితంలో ఫార్ములాలు, ఆంగ్ల భాషలో నైపుణ్యం ఉంటే ఉన్నతంగా రాణించడం సాధ్యం. వీటి ప్రాధాన్యతను గుర్తించిన సాక్షి మీడియా గ్రూప్ గణితం, ఆంగ్ల భాషపై విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించి ఆ రెండు సబ్జెక్టుల్లో నైపుణ్యం సాధించేలా వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏటా మ్యాథ్స్‌బీ, స్పెల్‌బీ నిర్వహిస్తోంది. పాఠశాల స్థాయి (రౌండ్–1), క్వార్టర్ ఫైనల్(రౌండ్–2), సెమీ ఫైనల్ (రౌండ్–3), ఫైనల్స్ (రౌండ్–4) విభాగాల్లో పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు నగదు, ఇతర ప్రోత్సాహక బహుమతులను అందిస్తోంది. ఈ ఏడాది ఈ రెండు పరీక్షలకు ప్రధాన స్పాన్సర్‌గా డ్యూక్స్ వేఫి, అసోసియేషన్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమండ్రి వ్యవహరిస్తోంది.
మ్యాథ్స్‌బీ ..
మ్యాథ్స్‌బీ సెమీ ఫైనల్స్ పోటీలకు విశేష స్పందన లభించింది. ఉదయం 10నుంచి 11గంటల వరకు నాలుగు కేటగిరీలకు చెందిన విద్యార్థులకు నిర్వహించిన ఈ పరీక్షకు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరై తమ మేధస్సుకు పదును పట్టారు.
స్పెల్‌బీ క్వార్టర్ ఫైనల్...
ఇదివరకు పాఠశాల స్థాయిలో నిర్వహించిన స్పెల్‌బీలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు రౌండ్–2 పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 11 గంటల వరకుకు నాలుగు కేటగిరీలో ఈ పరీక్ష జరిగింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. స్పెల్‌బీ పరీక్ష రాయడానికి విద్యార్థులు ఆసక్తి కనబరిచారు. ఇంగ్లిష్ భాషపై తమకున్న పట్టు, ప్రతిభను పరీక్షించుకున్నారు. స్పెల్‌బీ ద్వారా తమలో నైపుణ్యం, సామర్థ్యం పెరిగిందని, భాషపై పట్టు సాధించామని, కొత్త పదాలు, స్పెల్లింగులు, పదాల ఉచ్ఛారణ వంటి కొత్త విషయాలు తెలుసుకుంటున్నామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులను మరింత నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు సాక్షి ఇటువంటి పోటీ పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment