డీడీఈ పరీక్షల నిర్వహణపై విస్తృత చర్చ
తిరుపతి సిటీ: ఎస్వీయూలో వచ్చే నెల 3వ తేదీ నుంచి జరగనున్న డీడీఈ పరీక్షా కేంద్రాలను ప్రైవేటు విద్యాసంస్థల్లో నిర్వహిస్తే జరిగే పరిణామాలపై ‘కాసులు ముట్టాయా...కాపీ కొట్టొచ్చా’ శీర్షికన సాక్షి దిన పత్రికలో ప్రచురితమైంది. దీంతో ఉన్నత విద్యామండలి, ఎస్వీయూ అధికారులను డీడీఈ పరీక్షల నిర్వహణపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో హుటాహుటిన వర్సిటీ అధికారులు ఎస్వీయూ పరిధిలోని సుమారు 45 డీడీఈ స్టడీ సెంటర్ల కో–ఆర్డినేటర్లతో సోమవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి చర్చించారు. పరీక్షల నిర్వహణ వాయిదా వేస్తే కలిగే పరిణామాలు, యథావిధిగా పరీక్షలను నిర్వహించి పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు, వీడియో రికార్డు వంటి ఏర్పాట్లపై చర్చించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment