ప్రతి అర్జీకి పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

ప్రతి అర్జీకి పరిష్కారం

Published Tue, Jan 28 2025 1:27 AM | Last Updated on Tue, Jan 28 2025 1:27 AM

-

తోపుడు బండ్ల వ్యాపారులకు

న్యాయం చేయండి

తోపుడు బండ్లతో వ్యాపారం చేసుకుంటున్న వారికి న్యాయం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ వద్ద చిరు వ్యాపారులతో కలిసి ధర్నా చేపట్టారు. తిరుపతి నగరంలో పెద్ద హోటల్స్‌ జోలికి వెళ్లకుండా చిరు వ్యాపారులను వేధిస్తున్నారని చెప్పారు. చిరు వ్యాపారులపై మున్సిపల్‌ అధికారులు వేధింపులు మానుకోవాలని డిమాండ్‌ చేశారు. తిరుపతిలో 7వేల మంది తోపుడుబండ్లతో వ్యాపారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. సీఐటీయూ నేతలు పాల్గొన్నారు.

తిరుపతి అర్బన్‌: కలెక్టరేట్‌కు ఇచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని జాయింట్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు 261 అర్జీలు వచ్చాయి. అందులో 158 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే ఉన్నాయి. జేసీ మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలను వాయిదాలు వేయకుండా ఇక్కడే పరిష్కరించాలని చెప్పారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి అవసరమైన డాక్యుమెంట్స్‌తో కూడిన వివరాలను అర్జీదారులకు అందజేయాలని సూచించారు. డీఆర్వో నరసింహులు, డెప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, సుధారాణి, రోజ్‌మాండ్‌ అర్జీలను స్వీకరించారు. తిరుచానూరుకు చెందిన శ్రీదేవి అనే మహిళ తమకు న్యాయం చేయాలంటూ ఓ వినతిపత్రాన్ని అందించారు. తన ఇంటిని కొందరు రిజిస్ట్రేషన్‌ చేయించుకుని, డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని పేర్కొన్నారు.

అర్జీల మోత

కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఎక్కడ చూసినా అర్జీలు రాసేవారే కనిపించారు. ఆ మేరకు తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు. అయితే గతంలో అర్జీలను రాసి ఇవ్వడానికి ప్రత్యేకంగా వీఆర్వోలను ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement