గజ బీభత్సం
చంద్రగిరి : మండలంలోని కొండ్రెడ్డికండ్రిగ, యల్లంపల్లెలో సోమవారం అర్ధరాత్రి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. సుమారు 12 ఏనుగులు గ్రామంలోకి చొరబడ్డాయి. సమీపంలోని అరటి, మామిడితోటలతోపాటు వరి పంటలను నాశనం చేశాయి. గజరాజుల ఘీంకారంతో గ్రామస్తులు వణికిపోయారు. నీటి పైపులను ధ్వంసం చేశాయి. ఇటీవల ఏనుగుల దాడిలో కందులవారిపల్లె ఉప సర్పంచ్ రాకేష్చౌదరి మృతి చెందిన విషయం విధితమే. ఆ ఘటన మరువకముందే మరోసారి ఏనుగులు హల్చల్ చేయడంతో స్థానికులు భయాందోళన చెందారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మరో ప్రాణం బలికాకముందే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
పెన్షనర్ల పరిశీలన
వాకాడు : మండలంలోని పలు గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.15వేల పెన్షన్ పొందుతున్నవారిని వైద్యుల బృందం మంగళవారం పరిశీలించింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ అన్నపూర్ణారావు మాట్లాడుతూ మండలంలో మొత్తం 12 మంది దీర్ఘకాలిక రోగాల బారిన పడి పింఛన్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈమేరకు వారిని ఆరోగ్యస్థితిగతులను పరిశీలించి, నివేదిక రూపొందించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment