విజయం మనదే | - | Sakshi
Sakshi News home page

విజయం మనదే

Published Wed, Jan 29 2025 12:42 AM | Last Updated on Wed, Jan 29 2025 12:42 AM

విజయం

విజయం మనదే

గజ బీభత్సం
చంద్రగిరి మండలంలో సోమవారం అర్ధరాత్రి ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేసింది. పంట పొలాలను ధ్వంసం చేసింది.
కూతురే కొడుకై ..
వెంకటగిరి పోలీస్‌స్టేషన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటయ్య అంత్యక్రియలను ఆయన కుమార్తె ధరణి నిర్వహించారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2025

పేదల గూడు ఘోషిస్తోంది. ప్రభుత్వం నిర్లక్ష్యంతో అసంపూర్తిగా మిగిలిపోయింది. రాజకీయ వికృత క్రీడలో పావుగా మారి విలపిస్తోంది. పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు చేరుతోంది. పిచ్చిమొక్కల నడుమ దిష్టిబొమ్మలా దర్శనమిస్తోంది. బడుగుల సొంతింటి కల గాలిలో దీపంగా మారిపోయింది. ఈ క్రమంలో లబ్దిదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. పక్కా గృహాలపై కక్షపూరితంగా వ్యవహరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఇళ్లు కేటాయించారని గుర్తుచేస్తున్నారు. నిర్మాణ పనులకు సైతం ఆర్థికసాయం అందించారని వెల్లడిస్తున్నారు. సకాలంలో బిల్లులు చెల్లించి..వేలాది నివాసాలను శరవేగంగా పూర్తి చేయించారని ప్రశంసిస్తున్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక ఎక్కడి పనులు అక్కడే నిలిపేశారని వాపోతున్నారు. జగనన్న కాలనీలకు ఎన్‌టీఆర్‌ పేరు పెట్టడం మినహా చేసిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు పైసా కూడా వెచ్చించలేదని విమర్శిస్తున్నారు.

అడుసుపాళెంలో ఆగిన ఇళ్ల నిర్మాణం

బిల్లులు ఇవ్వడం లేదు

కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. మా గ్రామానికి సమీపంలోనే జగనన్న కాలనీలో ఇంటి పట్టా ఇచ్చారు. ఆ మేరకు ఇల్లు కట్టుకుంటున్నాం. అయితే సార్వత్రిక ఎన్నికల ముందు ఒక బిల్లు ఇచ్చారు. ఎన్నికల తర్వాత మాకు బిల్లులు ఇవ్వడంలేదు. దీంతో ఇంటి నిర్మాణం ఆపేసుకోవాల్సి వ చ్చింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి న్యా యం చేయాలి. –అంకమ్మ, చిట్టేడు, కోట మండలం

అంధకారంలో బతుకుతున్నాం

జగనన్న కాలనీలో నివాసం ఉంటున్నాం. అయితే మాకు వీధిలైట్లు లేకపోవడంతో అంధకారంలోనే బతుకుతున్నాం.మరోవైపు రోడ్లు సక్రమంగా లేవు. వర్షం వస్తే నానా ఇబ్బందులు పడుతున్నాం. మురుగునీరు వెళ్లడానికి వీలుగా కాలువలు లేవు. దీంతో దోమల బెడద తప్పడం లేదు. జ్వరాల బారిన పడుతున్నాం. మా కాలనీలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. – నవ మల్లిక, రేణిగుంట

ఆందోళనతో ఆపేశాం

మాకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇంటి పట్టా ఇచ్చారు. అయితే అప్పట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటిని నిర్మించుకోలేదు. తాజాగా గృహ నిర్మాణం కోసం బేస్‌మెంట్‌ వేయడానికి గుంతలు తవ్వుకున్నాం. అయితే మా కాలనీలో పలువురు బిల్లులు రావడం లేదని చెప్పారు. దీంతో సకాలంలో బిల్లులు వస్తాయో రావో...అనే ఆందోళనతో పనులు ఆపేశాం. – ఏసు,

కాలమనాయుడుపేట, సత్యవేడు మండలం

జాప్యం లేకుండా చూస్తాం

ఇంటి నిర్మాణాలు, బిల్లులు మంజూరు చేయించడంలోను జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటాం. ఇసుక సమస్య లేకుండా ఏర్పాట్లు చేస్తాం. కొత్తగా జిల్లాకు వచ్చా. అన్ని అంశాలను పరిశీలన చేస్తున్నా. లోటుపాట్లు ఉంటే సవరిస్తా. ఇంటి నిర్మాణాలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తా. ఎవరికి కేటాయించిన ప్లాట్లలో వారు ఇంటి నిర్మా ణాలు చేపట్టడానికి ముందుకు రావాలి. లబ్ధిదారులకు పూర్తిగా సహకరిస్తా. – పి. దయాకర్‌,

జిల్లా అధికారి, గృహనిర్మాణశాఖ

స్మార్ట్‌ సిటీ పనులపై సమీక్ష

తిరుపతి అర్బన్‌ : తిరుపతి స్మార్ట్‌ సిటీ పనుల పురోగతిపై కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ సమీక్షించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కార్పొరేషన్‌ కమిషనర్‌ మౌర్యతో కలిసి ఎన్‌ఈసీ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నగరంలో స్మార్ట్‌ సిటీ అభివృద్ధి పనులకు ఎప్పటికప్పుడు నిధులు పెండింగ్‌ లేకుండా చూడాలని ఆదేశించారు. వివిధ దశల్లో ఉన్న పనులను నాణ్యతతోపాటు వేగవంతం చేయాలని తెలిపారు. సిటీ ఆపరేషన్‌ సెంటర్‌ భవన నిర్మాణ పనులను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో స్మార్ట్‌ సిటీ జీఎం చంద్రమౌళి, ఎన్‌ఈసీ ప్రతినిధులు ప్రదీప్‌, జమాల్‌, అంబర్‌, ఫణి కుమార్‌, కెల్ట్రాన్‌ సతీష్‌, ఏఈకామ్‌ ప్రతినిధులు బాలాజీ, చంద్రా రెడ్డి, హేమ, ఎస్‌ఈ శ్యాంసుందర్‌, ఈఈ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

ఎస్సీ వెల్ఫేర్‌ అధికారి బదిలీ

తిరుపతి అర్బన్‌ : జిల్లా ఎస్సీ సంక్షేమశాఖాధికారి చెన్నయ్య మంగళవారం చిత్తూరుకు బదిలీ అయ్యారు. ఆయన 2022 నుంచి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉత్తమ సేవలు అందించి మూడేళ్లలో ఆరు పర్యాయాలు అవార్డులు అందుకున్నారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి విక్రమ్‌ కుమార్‌ను తిరుపతికి బదిలీ చేశారు. ఆయన శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు.

టెక్నాలజీపై పట్టు అవసరం

తిరుపతి సిటీ : ఆధునిక టెక్నాలజీపై విద్యార్థులకు పట్ట అవసరమని చైన్నె సవిత యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఎమ్‌ఎస్‌ శరవణన్‌ తెలిపారు. మంగళవారం పద్మావతి మహిళా వర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ సీఎస్‌ఈ విభాగం ఆధ్వర్యంలో సెలెస్ట్రా–2025 పేరుతో రెండురోజుల టెక్‌పెస్ట్‌ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన శరవణన్‌ మాట్లాడుతూ విద్యార్థులు అకడమిక్‌ విద్యతో పాటు నూతన టెక్నాలజీ, పరిశోధనలు, ఆవిష్కరణలపై దృష్టి సారించాలన్నారు. టెక్నోఫెస్ట్‌తో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు తమ మేధోశక్తిని, ఐడియాలను పంచుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. రిజిస్ట్రార్‌ రజనీ మాట్లాడుతూ విద్యార్థినులలోని సృజనాత్మకతను వెలికితీసి వారిని మరింత ప్రోత్సహించడమే సెలెస్ట్రా టెక్‌ ఫెస్ట్‌ ప్రధాన ఉద్ధేశమన్నారు. అనంతరం విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు. ప్రొఫెసర్‌ మల్లికార్జున, సీఎస్‌ఈ హెడ్‌ ప్రొఫెసర్‌ సరిత, కన్వీనర్‌ డాక్టర్‌ సాయి లోహిత, లక్ష్మీదేవి పాల్గొన్నారు.

తిరుపతి అర్బన్‌ : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్తం 575 జగనన్న కాలనీలను ఏర్పాటు చేశారు. సుమారు 77,765 మందికి పక్కా ఇళ్లు మంజూరు చేశారు. లేఅవుట్‌లలో మౌలిక వసతులు కల్పించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి చేయూతనందించారు. కేవలం రెండేళ్లలోనే 24,618 ఇళ్లు పూర్తి చేయించి లబ్దిదారులతో గృహ ప్రవేశం చేయించారు. మిగిలిన గృహాలను సైతం వివిధ దశల్లోకి తీసుకువచ్చారు. ఇందుకు గాను రూ.792.52 కోట్లు ఖర్చు పెట్టారు. 2025 మార్చి 31వ తేదీకి వందశాతం గృహాలు పూర్తి చేయాలనే లక్ష్యాలను నిర్దేశించారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికల వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో పేదలందరికీ గూడు కల్పించాలనే మహోన్నత ఆశయం నీరుగారిపోయింది. గత ఏడాది జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా కేవలం 2,041 ఇళ్లు మాత్రమే పూర్తి చేయడం గమనార్హం.

జీపాళెంలో ఇసుక కొరతతో ఆగిన నిర్మాణ పనులు

పురస్కారాలకు దరఖాస్తులు

తిరుపతి కల్చరల్‌ : వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న వారి నుంచి సేవా భూషణ్‌, విద్యా భూషణ్‌ జాతీయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ ఈఎస్‌ఎస్‌ నారాయణ మాస్టార్‌ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 9వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించే వార్షికోత్సవంలో పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. వివరాలకు 9652347207 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 4 కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నా యి. సోమవారం అర్ధరాత్రి వరకు 65,278 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,077 మంది భక్తు లు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ. 3.70 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలో సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళితే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది.

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

జగనన్న కాలనీల్లో

ఆగిపోయిన పనులు

పక్కా ఇంటి నిర్మాణాలను

పట్టించుకోని ప్రభుత్వం

ఎన్‌టీఆర్‌ కాలనీలుగా పేరు మార్చి

చేతులుదులుపుకున్న వైనం

గత వైఎస్సార్‌సీపీ హయాంలో 77,765 ఇళ్ల మంజూరు

ప్రతి నెలా వెయ్యికి పైగా పూర్తయిన ఇళ్లు

ప్రస్తుత కూటమి పాలనలో 8 నెలలకు 2,041 గృహాలకు మాత్రమే మోక్షం

నాడు రూ.798.87 కోట్ల చెల్లింపులు

నేటి వరకు పైసా వెచ్చించని

కూటమి సర్కారు

పేరు మార్చి.. పనులు ఆపేసి

పేదల ఇంటి నిర్మాణాలను కూటమి సర్కార్‌ చిన్న చూపు చూస్తోంది. చివరికి పక్కా ఇళ్ల విషయంలోనూ రాజకీయాలు చేయడం ఏంటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. జగన్నన కాలనీలను ఎన్టీఆర్‌ గృహాలుగా పేరు మార్చడం తప్ప ప్రభుత్వం ఏమీ చేయలేదని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తోంది. ఇప్పటి వరకు గత వైఎస్సార్‌సీపీ సర్కార్‌లో ఇంటి నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లను తప్పించి..తమ వారికి కాంట్రాక్ట్‌లు ఇప్పించారు. అయితే పనులు మాత్రం చేపట్టలేదు. ఆయా కాలనీల్లో ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్టే ఉంది. దీనికి తోడు జిల్లాలో ఎక్కడా ప్రభుత్వ పాలసీ కింద ఉచిత ఇసుక లభించడం లేదు. దీంతో ఇంటి నిర్మాణాలకు బ్రేక్‌ పడక తప్పలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.

రద్దు చేస్తామనడం దారుణం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిరుపేదలకు మంజూరు చేసిన స్థలాల్లో ఇంటి నిర్మాణం చేపట్టకపోతే రద్దు చేస్తామని చెప్పడం దారుణం. ఆర్థిక ఇబ్బందులతో పనులు ప్రారంభించని వారికి సాయం అందించాలి. వారు ఇల్లు కట్టుకునేందుకు ప్రోత్సహించాలి. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రతి ఒక్క లబ్ధిదారుడికీ ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు ఇస్తామని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకోవాలి. అంతే కానీ పట్టా రద్దు చేస్తామని భయపెట్టడం సరికాదు.

– శివకవి ముకుంద, సీపీఎం నేత, నాయుడుపేట

No comments yet. Be the first to comment!
Add a comment
విజయం మనదే 1
1/12

విజయం మనదే

విజయం మనదే 2
2/12

విజయం మనదే

విజయం మనదే 3
3/12

విజయం మనదే

విజయం మనదే 4
4/12

విజయం మనదే

విజయం మనదే 5
5/12

విజయం మనదే

విజయం మనదే 6
6/12

విజయం మనదే

విజయం మనదే 7
7/12

విజయం మనదే

విజయం మనదే 8
8/12

విజయం మనదే

విజయం మనదే 9
9/12

విజయం మనదే

విజయం మనదే 10
10/12

విజయం మనదే

విజయం మనదే 11
11/12

విజయం మనదే

విజయం మనదే 12
12/12

విజయం మనదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement