తిరుపతి లీగల్ : చెక్‌బౌన్స్ కేసులో తిరుపతి కొర్లగుంటకు చెందిన జి.ప్రదీప్ అనే నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ తిరుపతి మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి బుధవారం తీర్పు చెప్పారు. ఫిర్యాదీ తరపు న్యాయవాది కె.చక్రవర్తి కథనం మేరకు.. తిరుపతి, రేణిగుంట రోడ్డు, చైతన్య పురానికి చెందిన శ్యామ్‌సుందర్ వద్ద ప్రదీప్ 2020 డిసెంబర్ 9వ తేదీన రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న సొమ్ము చెల్లించే క్రమంలో 2022 మే 13వ తేదీన శ్యామ్సుందర్కు రూ.5లక్షల విలువైన చెక్కు ఇచ్చాడు. అది బ్యాంకులో వేయగా బౌన్స్ అయ్యింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఈ మేరకు ప్రదీప్‌కు శిక్ష విధించారు. అలాగే పరిహారం కింద రూ.5లక్షలు చెల్లించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment