
పాలిటెక్నిక్ విద్యతో ఉన్నత భవిత
తిరుపతి ఎడ్యుకేషన్ : పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సు చేస్తే విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు ఉంటుందని తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి అన్నారు. బుధవారం ఆ విద్యాసంస్థలో నిర్వహించిన పాలిటెక్నిక్, ఏపీఆర్‌జేసీ నమూనా పరీక్ష, అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది. ఆయన మాట్లాడుతూ, పాలిటెక్నిక్‌లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, మైనింగ్, కెమికల్, బయోమెడికల్, మెటలర్జి, త్రీడి యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్, పెట్రోలియం, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఇండస్రీ ఇంటిగ్రేటెడ్), మెకానికల్ రిఫ్రిజరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్, ఫ్యాషన్ టెక్నాలజీ వంటి కోర్సులు ఉన్నాయన్నారు. పాలిటెక్నిక్ విద్యార్హతతో ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, ఇంజినీరింగ్, ఆర్‌అండ్‌బీ, రైల్వే, బెల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఆర్టీసీ, విద్యుత్ వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోను, అలాగే కార్పొరేట్ సంస్థల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, వీటిలో డిప్లొమో చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారని, దీనికి దరఖాస్తు చేసుకోవడానికి 15వ తేదీ ఆఖరు అని, అలాగే ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష ఈ నెల 25వ తేదీ ఉంటుందని, దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 6వ తేదీ ఆఖరు అని తెలిపారు. గత 35ఏళ్లుగా సైనిక్, నవోదయ, పాలిటెక్నిక్, ఏపీఆర్‌జేసీ వంటి పోటీ పరీక్షల్లో తమ విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధిస్తూ ఆయా విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నట్టు చెప్పారు. ఆయా పోటీ పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలకు 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. సదస్సులో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పాలిసెట్, ఏపీఆర్‌జేసీ అవగాహన
సదస్సుకు స్పందన