
రైటింగ్ స్కిల్స్‌తో సమాచారం విశ్వవ్యాప్తం
తిరుపతి సిటీ: అకడమిక్ రైటింగ్ స్కిల్స్ పెంపొందించుకుంటేనే అలోచనలు, రచనలు వంటి స మాచారం ప్రపంచానికి చేరుతుందని ఎస్వీయూ వీసీ సీహెచ్ అప్పారావు పేర్కొన్నారు. ఎస్వీయూ ఇంగ్లీషు విభాగం ఆధ్వర్యంలో ‘విద్యార్థులకు, పండితులకు అకడమిక్ రైటింగ్– మెళకువలు’ అ నే అంశంపై రెండు రోజుల పాటు జరగనున్న జా తీయ వర్క్‌షాపు గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా విచ్చేసి మా ట్లాడారు. ఆధునిక పోటీ ప్రపంచంలో విద్యార్థు లు, పరిశోధకులు, పండితులు రైటింగ్ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించి మెళకువలను అభ్యసనం చేయాలని సూచించారు. దిండిగల్ గాంధీగ్రామ్ రూరల్ వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ జోసెఫ్ దొరై రాజ్ రిసోర్స్ పర్సన్ గా విచ్చేసి అకడమిక్ రైటింగ్ నైపుణ్యాలు, ఏకీకరణ, పొందిక, స్పష్టత అనే అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. క న్వీనర్ ప్రొఫెసర్ శారద మాట్లాడుతూ విద్యార్థు లకు అకడమిక్ రైటింగ్ స్కిల్స్ ఎంతో అవసరమని, ఎన్‌ఈపీ 2020తో దీని ఆవశ్యకత సంతరించుకుందని, ఈ క్రమంలో జాతీయ వర్క్‌షాపు ని ర్వహించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. డీన్ ప్రొఫెసర్ మురళి పాల్గొన్నారు.
6న జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీలు
తిరుపతి ఎడ్యుకేషన్ : నగరంలోని శ్రీదేవి కాంప్లెక్స్‌లోని టెంపుల్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ, బాక్సింగ్ డెవెలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వ ర్యంలో ఈ నెల 6వ తేదీన జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఆ మేరకు రాష్ట్ర అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేన్ జిల్లా ఇన్‌చార్జ్ పి.గీతా ఒక ప్రకటనలో తెలిపారు. క్యాబ్, కేడెట్, జూనియర్, సీనియర్ విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ నెల 5వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఈ పోటీల్లో గెలిచిన బా లబాలికలు ఈ నెల 12, 13వ తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. వివరాలకు 95731 44232, 70135 91635 నంబర్లలో సంప్రదించాలన్నారు.