
అర్ధరాత్రి గ్యాంగ్ వార్
తిరుపతి క్రైమ్:నగరంలోని రెండు హోం స్టేల మధ్య అర్ధరాత్రి గ్యాంగ్ వార్ జరిగింది. ఈ ఘట న శనివారం వేకు జామున చోటుచేసుకుంది. ఈస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బస్టాండ్ సమీపంలోని చింతల్ చేను వద్ద రెండు హోంస్టేల్స్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. డిస్కన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులపై కర్రలు, రాడ్లతో గరుడ హోమ్ స్టే యాజమాన్యం దాడి చేసింది. ఇందులో డస్క్ సూట్స్ హోమ్స్ డే నిర్వాహకులు నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, పణీందర్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. వీరి వద్దకు వచ్చే కస్టమర్లను మరొక హోమ్ స్టే వాళ్లు లాక్కెళ్తున్నా రని వీరి మధ్య గొడవ చోటుచేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దాడికి పాల్పడిన ఏడుగురిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నగరంలో అర్ధరాత్రి ఇలాంటి ఘటనలు జరగడంతోస్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
అనుమతి లేని హోం స్టేలపై చర్యలు శూన్యం
నగరంలో హనుమతులేని హోమ్ స్టేలు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా రూములను అద్దెకి తీసుకొని హోమ్ స్టీల్ పేర్లతో నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిపోతున్నాయి. నిరంతరం గొడవలు చోటుచేసుకుంటున్నాయి. అయితే పోలీసులు మామూలు మత్తులో తూలుతూ.. వారికే వత్తాసు పలుకుతున్నారు. ఇప్పటికై నా ఇలాంటి వాటిపై పోలీసులు దృష్టి పెట్టాల్సి ఉంది.
ఇంట్లో చోరీ
చంద్రగిరి: ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన మండల పరిధిలోని భీమవరం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. భీమవరం గ్రామానికి చెందిన సుమతి వెదురుకుప్పం మండలంలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ తిరుపతిలో నివాసం ఉంటున్నారు. ఆదివారం పండుగ సందర్భంగా శనివారం ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంట్లో ఉంచిన 64 గ్రాముల బంగారం, కిలో వెండితో పాటు రూ.లక్ష నగదు దోచుకెళ్లినట్లు గుర్తించారు. అనంతరం బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రోడ్డు ప్రమాదంలో
ఏఎస్‌ఐ దుర్మరణం
పుత్తూరు: విధులు ముగించుకుని గ్రామానికి చేరుకుంటున్న ఏఎస్‌ఐ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంఘటన శనివారం రాత్రి పుత్తూరు మండలం వేపగుంట క్రాస్ వద్ద చోటు చేసుకుంది. సీఐ సురేంద్రనాయుడు కథనం మేరకు.. పుత్తూరు మండలం వేపగుంట పంచాయతీ అక్కేరి దళితవాడకు చెందిన ఎ.రఘుకుమార్(59) తిరుపతి ఎంఆర్‌పల్లెలో ఆర్ముడు రిజర్వు పోలీస్ ఫోర్స్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు. శనివారం యథావిధిగా విధులను ముగించుకుని తిరుపతి నుంచి బస్సులో స్వగ్రామానికి బయలుదేరి వేపగుంట గ్రామం వద్ద దిగి రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి 108లో పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అర్ధరాత్రి గ్యాంగ్ వార్

అర్ధరాత్రి గ్యాంగ్ వార్