విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
నవాబుపేట: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు. బుధవారం నవాబుపేట పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పీఎస్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో భూ తగాదాలు, భూ సమస్యలు, కుటుంబ సమస్యలే అధికంగా ఉన్నాయన్నారు. నాలుగేళ్లలో క్రైమ్ రేటు బాగా తగ్గిందన్నారు. జీరో క్రైమ్ రేటు పీఎస్‌గా మార్చాల్సిన బాధ్యత ఇక్కడి సిబ్బందిపై ఉందన్నారు. పేకాట, రేవ్ పార్టీలు జరిగితే అందుకు ఎస్‌ఐ, సీఐలదే బాధ్యత అన్నారు. ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ నారాయణరెడ్డి, డీఎస్‌పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ అరుణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
పేకాట, రేవ్ పార్టీలు జరిగితే ఎస్‌ఐ, సీఐలదే బాధ్యత
ఐజీ సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment