దివ్యాంగుల లెక్క తేల్చండి
ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలోని దివ్యాంగుల లెక్క తేల్చాలని వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఇబ్రహీంపట్నంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేపడుతున్న కులగణనలో దివ్యాంగుల సంఖ్యను సైతం తేల్చాలని ప్రభుత్వాన్ని కోరారు. జనాభా ప్రతిపాదికన బడ్జెట్ కేటాయించి ఉపాధి, ఉద్యోగ రంగాలల్లో ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వాలని కోరారు. గ్రామానికి పది చొప్పున దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్ నాయక్, ప్రధాన కార్యదర్శి జి.యాదయ్య, ఎం.బాలరాజ్, ఎ.సంజీవ పాల్గొన్నారు.
వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య
Comments
Please login to add a commentAdd a comment