డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరవణ
అనంతగిరి: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరవణ అన్నారు. బుధవారం వికారాబాద్‌లోని తన కార్యాలయంలో సే టూ నో డ్రగ్స్ అనే కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేడు కొంతమంది యువకులు జల్సాలకు, విలాసాలకు అలవాటు పడి మత్తు పదార్థాలు తీసుకోవడం ఫ్యాషన్‌గా భావిస్తున్నారని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసలై జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలంటే క్రీడలు, సామాజిక కార్యక్రమాలపై శ్రద్ధ పెట్టాలన్నారు. కళాశాలల్లో, పాఠశాలల్లో, గ్రామ పంచాయతీ సమావేశాల్లో, ప్రాథమిక, జిల్లా ఆస్పత్రుల్లో ప్రజలు, యువత, విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవీంద్రయాదవ్, ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ నిరోషా, కోఆర్డినేటర్లు రేణుకుమార్, జయరాం, రజిత, మహేష్, మురళీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment