సీఎం జగన్‌కే మా మద్దతు | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌కే మా మద్దతు

Published Fri, May 10 2024 6:00 PM

సీఎం జగన్‌కే మా మద్దతు

● రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌ లోకేశ్వరరావు రెడ్డి

తగరపువలస: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు వరకు రెడ్డి, రెడ్డిక సామాజిక వర్గమంతా సిద్ధంగా ఉందని రాష్ట్ర రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌ దుక్క లోకేశ్వరరావు రెడ్డి అన్నారు. గురువారం చిట్టివలస వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన కార్పొరేషన్‌ డైరెక్టర్లు శీరపు అప్పలరెడ్డి, సుగ్గు శ్రీనివాసరెడ్డి, రౌతు భాస్కరరెడ్డితో కలిసి మాట్లాడారు. తాము ఇచ్ఛాపురం నుంచి చిత్తూరు వరకు వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నామన్నారు. ఈ నెల 11 వరకు విశాఖ పార్లమెంట్‌ పరిధిలో అభ్యర్థుల గెలుపునకు ప్రచారం చేయనున్నామన్నారు. రెడ్డి, రెడ్డిక సామాజిక వర్గాల ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల వరకు ఉన్నారన్నారు. సీఎం జగన్‌ ఈ వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఉత్తరాంధ్ర రెడ్డి, రెడ్డిక సామాజికవర్గానికి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇచ్చేలా సీఎం జగన్‌ను ఎన్నికల తరువాత కోరతామన్నారు.

Advertisement
 
Advertisement