అందరి సమన్వయంతో పార్టీ బలోపేతం
విశాఖ సిటీ : ఉత్తరాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరిని సమన్వయం చేసుకుంటూ శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్‌గా నియమితులైన తర్వాత ఆయన విశాఖలో మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అధ్యక్షతన ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో గురువారం లాసెన్స్ బే కాలనీలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు వై.వి.సుబ్బారెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేశారని, దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. గతంలో పాలన చేసిన అనుభవంతో ఉత్తరాంధ్రలో పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ వారితో మమేకమయ్యేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. అందుకు అందరూ సహకరించాలని కోరారు. ముఖ్యంగా స్టీల్‌ప్లాంట్ అంశంలో చంద్రబాబు చెతులెత్తేశారని, వైఎస్సార్ సీపీ మాత్రం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తుందని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు.. ఇలా అందరిని సమన్వయం చేసుకుంటూ.. 2027 చివరిలో జరిగే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తామని వివరించారు. గతంలో పార్టీ కార్యకర్తలను విస్మరించిన మాట వాస్తవమే అని.. ఇప్పుడు వారికి పూర్తి ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి నుంచి కార్యకర్తల అభివృద్ధికి పాటు పడతామని చెప్పారు. సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, కన్నబాబు రాజు, కంబాల జోగులు, పెట్ల ఉమాశంకర్ గణేష్ , అదీప్‌రాజు, చింతలపూడి వెంకటరామయ్య, కె.భాగ్యలక్ష్మి, శోభ హైమావతి, పి.వరలక్ష్మి, సమన్వయకర్తలు కేకే రాజు, మలసాల భరత్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల రవికుమార్(రవిరెడ్డి), ఉరుకూటి అప్పారావు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
పార్టీ కార్యాలయం సందర్శన
కొమ్మాది: ఎండాడలో గల వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయాన్ని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి తొలిసారిగా సందర్శించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి ఆయనకు స్వాగతం పలికారు.
స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు పోరాడతాం
కార్యకర్తలకు పెద్ద పీట వేస్తాం
2027 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో
విజయమే లక్ష్యం
వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment