విషాదం
అంతులేని
తిరుపతి తొక్కిసలాట ఘటనలో నలుగురు ఉమ్మడి విశాఖవాసుల దుర్మరణం ప్రభుత్వ నిర్లక్ష్యంపై మృతుల కుటుంబ సభ్యుల ఆగ్రహం
ఇందిరానగర్‌లో ఫొటో పట్టుకుని
రోదిస్తున్న శాంతి తల్లి, బంధువు
ఒక్కొక్క కుటుంబానిది ఒక్కో కథ.. అంతులేని వ్యథ.. భగవంతుడి దర్శనంతో తమ జీవితాలు ధన్యమవుతాయని భావించిన వారి విధిని విధాత మరోలా రాశాడు. దైవ దర్శనానికి వెళ్లిన నలుగురు భక్తులు ఊహించని ప్రమాదంలో విగతజీవులుగా మారడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన ఆరుగురిలో నలుగురు ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన వారుండటం దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబ సభ్యుల మృతితో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే.. ఆయా కాలనీల ప్రజల హృదయాలు బరువెక్కాయి. ఈ హృదయ విదారక సంఘటన భక్తుల భద్రతా ఏర్పాట్లపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఈ దుర్ఘటన ప్రభుత్వం, టీటీడీ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– సీతంపేట/కంచరపాలెం/మద్దిలపాలెం/నర్సీపట్నం
Comments
Please login to add a commentAdd a comment