మధురవాడ : విశాఖ ఐటీ సెజ్‌లోని మధురవాడ హిల్ నంబర్–2లో గల కూటమి నేత పల్సస్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గమని సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్, మధురవాడ జోన్ సీఐటీయూ నాయకుడు డి.అప్పలరాజు పేర్కొన్నారు. ఒక పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖను ఆర్థిక రాజధాని చేస్తామని ప్రకటనలు చేస్తూ.. మరోవైపు ఐటీ పరిశ్రమలో ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడం ప్రభుత్వాల డొల్లతనానికి నిదర్శనమన్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని యాజమాన్యంతో జీతాలు ఇప్పించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఐటీ ఉద్యోగులకు మద్దతుగా మిగతా ఉద్యోగులు, కార్మికులను కూడగట్టి ప్రత్యక్ష ఆంధోళనకు దిగుతామని హెచ్చరించారు. ఐటీ ఉద్యోగుల పోరాటానికి సీఐటీయూ పూర్తి మద్దతు ఇస్తుందని, వారికి అండగా ఉంటామని తెలిపారు.
సీఐటీయూ డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment