డిప్యూటీ తహసీల్దార్‌కు జైలు
విశాఖలీగల్: చెల్లని చెక్కు జారీ చేసిన అనకాపల్లి జిల్లా యలమంచిలి డిప్యూటీ తహసీల్దార్ తురుమళ్ల హనుమాన్ వినయ్ కుమార్‌కి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ నగరంలోని రెండో అదనపు ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి గురువారం తీర్పునిచ్చారు. జైలు శిక్షతోపాటు రూ.9.05 లక్షలు జరిమానా విధించారు. ఇందులో రూ.9 లక్షలు బాధితురాలికి చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. బాధితురాలు పద్మావతి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. వినయ్ కుమార్ 2019 నవంబర్ 14వ తేదీన పద్మావతి దగ్గర రూ.12 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అప్పు తీర్చే నిమిత్తం 2022 మార్చి 2వ తేదీన వినయ్‌కుమార్ ఒక చెక్కు ఇచ్చారు. పద్మావతి ఆ చెక్కును తన బ్యాంక్ ఖాతాలో జమ చేయగా తగినన్ని నిధులు లేని కారణంగా చెక్కు నిరాదరణకు గురైంది. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తిపై విధంగా తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment