మధ్యవర్తిత్వానికి ప్రాధాన్యం ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

మధ్యవర్తిత్వానికి ప్రాధాన్యం ఇవ్వండి

Published Fri, Jan 31 2025 12:43 AM | Last Updated on Fri, Jan 31 2025 12:43 AM

మధ్యవర్తిత్వానికి ప్రాధాన్యం ఇవ్వండి

మధ్యవర్తిత్వానికి ప్రాధాన్యం ఇవ్వండి

విశాఖ లీగల్‌ : మధ్యవర్తిత్వంపై న్యాయవాదులు తగిన శిక్షణ పొందాల్సిన అవసరం ఉందని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్‌ న్యాయమూర్తులను కోరారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని గ్రంఽథాలయంలో గురువారం విశాఖ న్యాయవాదుల సంఘం, న్యాయసేవ ప్రాధికార సంస్థ సంయుక్తంగా మధ్యవర్తిత్వంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిధర్‌ మాట్లాడుతూ కేసుల విచారణకు ముందు ఇరువర్గాలు మధ్యవర్తిత్వ కేంద్రంలో తమ వాదనలు వినిపించాలని కోరారు. మీడియేషన్‌ అండ్‌ కన్సిలేషన్‌ జాతీయ శిక్షకురాలు రత్నతార మాట్లాడుతూ మధ్యవర్తిత్వ కేంద్రంలో కేసులను ప్రాథమిక దశలోనే ఇరువర్గాలు తమ వాదనలు వినిపిస్తే కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. మరో జాతీయ శిక్షకురాలు సత్యారావు మాట్లాడుతూ కేసుల విచారణలో ప్రాథమిక దశ చాలా కీలకమైందన్నారు,

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement