27 నుంచి పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ | Sakshi
Sakshi News home page

27 నుంచి పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌

Published Fri, May 24 2024 8:45 AM

27 నుంచి  పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌

విజయనగరం రూరల్‌: పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు ఈ నెల 27 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుందని విజయనగరం ఎంఆర్‌ఏజీఆర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జె.ఆశారమణి గురువారం తెలిపారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ప్రాసెసింగ్‌ రుసుం మీసేవలో గాని, ఆన్‌లైన్‌లో గాని చెల్లించి, సంబంధిత రసీదును తీసుకురావాలన్నారు. పాలిసెట్‌ పరీక్ష హాల్‌టికెట్‌, ర్యాంకు కార్డు, పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువీకరణపత్రం, రాబడి, కుల ధ్రువపత్రాలు తీసుకురావాలన్నారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూల్‌బాగ్‌లో ఉన్న ఎంఆర్‌ఏజీఆర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉద యం 9 గంటల నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ నెల 27 నుంచి జూన్‌ 3వ తేదీవరకు కౌన్సెలింగ్‌ జరుగుతుందని, ఈ నెల 31 నుంచి జూన్‌ 04 వరకు ఆఫ్సన్స్‌ ఎంపిక, జూన్‌ 7న సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement