జగనన్న హామీ అమలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
విజయనగరం జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న గుర్ల గ్రామంలో డయేరియా గత నెలలో విజృంభించింది. 13 మంది బలైపోయారు. తల్లి మృతిని జీర్ణించుకోలేక మనోవేదనతో మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం డయేరియాను అదుపు చేయడంలో గానీ, అసలు రోగ విజృంభణకు కారణాలు తెలుసుకోవడంలో గానీ వెంటనే తగినవిధంగా స్పందించలేదనే విషయం జగద్వితం.
‘పవన్’ సాయం గాల్లోనే...
గుర్ల విషాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం ముఖం కూడా బాధిత కుటుంబాలకు చూపించలేదు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం అక్టోబర్ 21వ తేదీన గుర్ల గ్రామానికి వచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అప్పటికి డయేరియాతో 10 మంది మృతి చెందారు. వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం నియమించిన కమిటీ విచారించి నివేదిక సమర్పిస్తే, దాని ప్రకారం ఎక్స్‌గ్రేషియాపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ తాను సొంతంగా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ నెల రోజులు గడిచిపోయినా కమిటీ నివేదిక ఏమైందో ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఆర్థిక సాయం అందలేదు.
ఈమె పేరు మరడాన అప్పలనర్సయ్యమ్మ. గుర్ల మండలంలోని కోటగండ్రేడు గ్రామానికి చెందిన ఆమె వయసు 55 సంవత్సరాలు. ఈ ఏడాది అక్టోబర్ 12న డయేరియా బారినపడింది. గుర్ల పీహెచ్‌సీలో చేర్చినా వ్యాధి అదుపులోకి రాకపోవడంతో విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కేజీహెచ్ తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ 17వ తేదీన మృతి చెందింది. అదే డయేరియా లక్షణాలతో ఆమె కన్నా ముందు ఏడుగురు చనిపోయారు. ఆ తర్వాత మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రభుత్వం దృష్టిలో ఒక్క అప్పలనర్సయ్యమ్మ మాత్రమే డయేరియాతో మృతి చెందారట. మిగతా పన్నెండు మందీ ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయారని ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. గుర్ల మండలంలో డయేరియా విసిరిన పంజాతో 13 మంది చనిపోతే వారిలో ఒక్కరు (అప్పలనర్సయ్యమ్మ) మాత్రమే డయేరియా మృతురాలిగా టీడీపీ కూటమి చెప్పుకుంటోంది. తీరా ఆమె కుటుంబానికీ ఎక్స్‌గ్రేషియా ఇవ్వకపోవడం గమనార్హం.
గుర్ల డయేరియా బాధిత కుటుంబాలకు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి అభయం
రూ.2 లక్షల చొప్పున 13 కుటుంబాలకు ఆర్థిక సాయం
నేడు అందజేయనున్న శాసనమండలి
విపక్షనేత బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన రూ.లక్ష సాయానికి కలగని మోక్షం
డయేరియా మృతుల కుటుంబాలకు టీడీపీ కూటమి ప్రభుత్వం మొండిచేయి
అధికారికంగా ప్రకటించిన
ఒక్క మృతురాలి కుటుంబానికీ అందని ఎక్స్‌గ్రేషియా
జగన్ మాటిచ్చారు.. సాయం పంపించారు..
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్ల గ్రామానికి అక్టోబర్ 24వ తేదీన వచ్చారు. డయేరియాతో మృతి చెందిన 13 మంది కుటుంబసభ్యులతో మాట్లాడారు. డయేరియా మహమ్మారి ఏవిధంగా తమ ఇంటిదీపాలను ఆర్పేసిందో వారంతా ఆయన ముందు గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో చలించిపోయిన ఆయన ఒక్కొ కుటుంబానికి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం పార్టీ తరఫున ఇస్తామని ప్రకటించారు. వాటికి సంబంధించిన చెక్కులు సిద్ధం చేస్తున్న తరుణంలోనే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రకటన వచ్చింది. దీంతో వాటిని అందజేసే కార్యక్రమం వాయిదావేశారు. ఇప్పుడు కోడ్ అడ్డంకి తొలగడంతో ఈనెల 26వ తేదీ (మంగళవారం) నాడు అందజేయడానికి పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు చెక్ అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment