● ఆదుకోండి సారూ..
జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోత దశలో ఉన్న వరి పంటను కత్తెర, కొమ్ము పురుగు ఆశించింది. కంకులన్నీ రాలిపోతున్నాయి. ఆరుగాలం శ్రమించి పంటను సాగుచేసిన రైతన్నకు అపార నష్టం వాటిల్లింది. టీడీపీ కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలంటూ కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సభ్యులు సోమవారం ధర్నా చేశారు. పురుగుపోటుకు గురైన పంటను జేసీ ఎస్.సేతుమాధవన్‌కు చూపించి ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు. పంట నష్టం వివరాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శి బి.రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.వెంకటరమణ, వెంకటరావు, గోపాలం, ఆదినారాయణ పాల్గొన్నారు. – విజయనగరం అర్బన్
Comments
Please login to add a commentAdd a comment