గణారాధన
వేపాడ: మండలంలోని వల్లంపూడి సాంభమూర్తి ఆలయం ప్రాంగణంలో సోమవారం రాత్రి గణారాధనను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. రాత్రికి వేపాడ–వల్లంపూడి జంట గ్రామాలకు చెందిన వందలాదిమంది భక్తులు కాగడాలను వెలిగించి శివ, హరినామస్మరణలో తరించారు. అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా సాంభమూర్తి సేవా సంఘం సభ్యులు, గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు.
వినతుల పరిష్కారానికి ఆదేశం
విజయనగరం అర్బన్: జిల్లాలోని భూముల రీ సర్వే సందర్భంగా నిర్వహించిన గ్రామసభల్లో ప్రజల నుంచి వచ్చిన వినతులను మంగళవారంలోగా పీజీఆర్‌ఎస్‌లో ఆప్‌లోడ్ చేసి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లు, సర్వేయర్లను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియా కాన్ఫరెన్స్‌లో ఆయన సోమవారం మాట్లాడారు. జిల్లాలో గతంలో భూసర్వే నిర్వహించిన గ్రామాల్లో 502 గ్రామసభలు నిర్వహించామని, ఇందులో 24,150 వినతులు అందగా రీ సర్వేకు సంబంధించి 10,510 దరఖాస్తులు, రెవెన్యూ శాఖకు సంబంధించినవి 13,640 ఉన్నట్టు వెల్లడించారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీఓలు, సర్వే భూ రికార్డుల విభాగం ఏడీ రమణమూర్తి, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.
ప్రారంభించని ఉపాధి పనులు నేటితో రద్దు
జిల్లాలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సీసీ రోడ్డు, ఇతర పనులను ప్రారంభించేందుకు ఈ నెల 26వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని, అప్పటికీ ప్రారంభించకపోతే పనులు రద్దు చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో ఇంకా సుమారు 283 పనులను ప్రారంభించాల్సి ఉందని, వీటిని మంగళవారం నాటికి ప్రారంభించకపోతే రద్దు చేస్తామని స్పష్టంచేశారు.
హాల్‌టికెట్ల పంపిణీ నిలిపివేయవద్దు
పార్వతీపురం: ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తం మంజూరు కాలేదని విద్యార్థుల హాల్‌టికెట్లు, ధ్రువీకరణ పత్రాల పంపిణీని నిలిపివేయవద్దని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో అధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నెపంతో విద్యార్థులను తరగతులు, ప్రాక్టికల్స్‌కు దూరంగా ఉంచకూడద ని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నేరుగా కళాశాలలకు విడుదలవుతుందని విద్యార్థులపై ఒత్తి డి తేవడం సరికాదన్నారు. కళాశాలల యాజ మాన్యం విద్యార్థులపై ఒత్తిడి తెస్తే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment