● హింసకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం | - | Sakshi
Sakshi News home page

● హింసకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

Published Tue, Nov 26 2024 1:15 AM | Last Updated on Tue, Nov 26 2024 1:15 AM

 ● హింసకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

● హింసకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ పిలుపునిచ్చారు. హింస వ్యతిరేక దినం సందర్భంగా విజయనగరం ఎస్‌ఎస్‌జే కళాశాలలో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ఇటీవల కాలంలో రాష్ట్రం, జిల్లాలో మహిళలు, పిల్లలు, విద్యార్థినులపై అత్యాచారాలు, హత్యా ఘటనలు పెరిగాయని, వీటి నివారణకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. మహిళలే ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఐక్య ఉద్యమంపై విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. మహిళలు, బాలికలకు సమాజం, కుటుంబం, స్నేహితులు, విద్యాసంస్థలు అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి వి.లక్ష్మి పాల్గొన్నారు. – విజయనగరం పూల్‌బాగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement