ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం | Sakshi
Sakshi News home page

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం

Published Thu, May 9 2024 3:45 AM

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి

ఖిల్లాఘనపురం: పార్లమెంట్‌ ఎన్నికలు పూర్తి కాగానే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని సూరాయిపల్లి, ఉప్పరిపల్లి, సోళీపురం, రుక్కన్నపల్లి, షాపురం, మల్కాపురం, మానాజీపేట, గట్టుకాడిపల్లి, మహ్మద్‌ హుస్సేన్‌పల్లి, వెంకటాంపల్లి, ఆగారం, కమాలోద్ధీన్‌పూర్‌, తిర్మలాయపల్లి, అల్లమాయపల్లి తదితర గ్రామాల్లో రాష్ట్ర ఏఐపీసీ కో–ఆర్డినేటర్‌ డా. జిల్లెల ఆదిత్యారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌యాదవ్‌, మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌, జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షుడు రమేష్‌ తదితరులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని ఇప్పటికే అమలు చేశామని గుర్తుచేశారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, పంట రుణమాఫీ, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ తదితర హామీలు నియోజకవర్గంలో అమలవుతాయని చెప్పారు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితే రాష్ట్రానికి అత్యధిక నిధులు వస్తాయన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మహ్మదుస్సేన్‌పల్లి గ్రామాన్ని మూసాపేట మండలం నుంచి ఖిల్లాఘనపురం మండలానికి మారుస్తామని హామీ ఇచ్చారు. కాగా, గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మత్య్సశాఖ జిల్లా అధ్యక్షుడు నందిమళ్ల యాదయ్య, దేవిజానాయక్‌, కొంకి వెంకటేష్‌, దామోదర్‌రెడ్డి, బి.కృష్ణ, రాజేశ్వర్‌రెడ్డి, సత్యారెడ్డి, పెంటన్న యాదవ్‌, విజయవర్దన్‌రెడ్డి, వెంకట్రాములు యాదవ్‌, బుచ్చారెడ్డి, సహదేవుడు, వెంకటయ్య, రాగి వేణు, దివాకర్‌, దేవన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement