‘సొమ్ము మాయం’పై అడిషనల్‌ కలెక్టర్‌ ఆరా.. | Sakshi
Sakshi News home page

‘సొమ్ము మాయం’పై అడిషనల్‌ కలెక్టర్‌ ఆరా..

Published Sat, May 25 2024 12:20 PM

‘సొమ్

వనపర్తిటౌన్‌: పురపాలికలో కాంట్రాక్టర్లకు సంబంధించి ఎఫ్‌ఎస్‌డీ, ఈఎండీ ఖాతాల్లో డబ్బులు ఖాళీ అయిన విషయమై ఈ నెల 22న ‘సాక్షిశ్రీలో ‘సొమ్ము మాయం..’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో శానిటేషన్‌, రెవెన్యూ, ఇంజినీరింగ్‌, అకౌంట్‌ సెక్షన్ల అధికారులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఎఫ్‌ఎస్‌డీ సొమ్ము ఎటు పోయిందని.. కాంట్రాక్టర్లకు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. పుర ఖజానా ఖాళీగా ఉండటం.. అప్పట్లో కలెక్టర్‌ ప్రొసీడింగ్‌లకు అనుగుణంగా నిధులు డ్రా చేసినట్లు బదులిచ్చారు. ఎంత మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు.. నిబంధనలకు అనుగుణంగా సిబ్బంది ఉన్నారా? లేరా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనలకు అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బంది నియామకానికి సీఎండీఏకు లిఖిత పూర్వకంగా విన్నవించాలని సూచించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో తాగునీటి పైప్‌లైన్‌ లీకేజీ, పెండింగ్‌ పనులు, ప్రారంభం కాని పనులు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. పుర ఆదాయం పెంచేందుకు పన్ను వసూళ్లలో వేగం పెంచాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. బహుళ అంతస్తు నిర్మాణాలను పరిశీలించి అందుకు అనుగుణంగా అసెస్‌మెంట్‌ పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. ట్రేడ్‌ లైసెన్స్‌ విధిగా వసూలు చేయాలన్నారు. సమావేశంలో కమిషనర్‌ ఎం.పూర్ణచందర్‌, ఆర్‌ఓ అనిల్‌కుమార్‌, డీఈ మహాలక్ష్మి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఉమామహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఒక్కో విభాగం అధికారులతో వేర్వేరుగా సమీక్ష

‘సొమ్ము మాయం’పై అడిషనల్‌ కలెక్టర్‌ ఆరా..
1/1

‘సొమ్ము మాయం’పై అడిషనల్‌ కలెక్టర్‌ ఆరా..

Advertisement
 
Advertisement
 
Advertisement