మూగ జీవులను వధించడం నేరం
● వనపర్తిలో భారీ శాకాహార ర్యాలీ
వనపర్తిటౌన్: మూగ జీవులను చంపడం నేరమని.. దేవుళ్లు కూడా జీవహింస మెచ్చరని వనపర్తి ధ్యాన కేంద్రం నిర్వాహకులు బండ్ల ఆంజనేయరెడ్డి, సంబు వెంకటేశ్వర్లు, రాధాకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో భారీ శాకాహార ర్యాలీ నిర్వహించారు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదని, మూగ జీవాలను చంపి తినడం అనైతికమని నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఓమేష్‌గౌడ్, ప్రతినిధులు స్వర్ణలతారెడ్డి, తిరుపతయ్య, సత్యనారాయణరెడ్డి, బాలకృష్ణారెడ్డి, నర్సింహాయాదవ్, భాగ్యలక్షి, సునీత, శైలజ, సరిత, ప్రవీణ్, వేణుగోపాల్, రాములు, జయంత్ పాల్గొన్నారు.
రైతు సదస్సును
విజయవంతం చేద్దాం
కొత్తకోట రూరల్: మహబూబ్‌నగర్‌లో ఈ నెల 30న జరగనున్న రైతు సదస్సుకు జిల్లా రైతులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కాంగ్రెస్‌పార్టీ కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఆదివారం పెద్దమందడి మండలం అల్వాల, పెద్దమందడి, మణిగిళ్లలోని కొనుగోలు కేంద్రాల దగ్గరకి వెళ్లి రైతులకు ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి చేపట్టిన పనులను వివరించారు. ఆధునిక సాగు పద్ధతులు, మెళకువలను రైతులకు తెలియజేసేలా ఈ నెల 28న వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్‌పంప్ కంపెనీల నూతన ఆవిష్కరణలు, వివిధ కంపెనీల వినూత్న ఉత్పత్తులను ఇక్కడే స్టాల్ ఏర్పాటు చేసి ప్రదర్శిస్తామని చెప్పారు. ఆధునిక పరికరాలు, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రోన్లు, ప్రదర్శనలో ఉంచనున్నట్లు తెలిపారు. 30వ తేదీన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారని.. జిల్లా రైతులు, కాంగ్రెస్ అభిమానులు, నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఉమ్మడి మహబూబ్‌గర్ జిల్లాలోని రైతులందరూ పాల్గొని రైతు అవగాహన సదస్సును విజయవంతం చేయాలని కోరుతున్నాను. కార్యక్రమంలో పెద్దమందడి పీఏసీఎస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు పెంటన్న యాదవ్, పీఏసీఎస్ డైరెక్టర్ నరేశ్‌కుమార్, కిసాన్‌సెల్ మండల అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసులు, గట్టు మన్యం, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment