ప్రతిపక్షాల మాటలను ప్రజలు నమ్మరు
వనపర్తిటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అిభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని.. ప్రజాక్షేత్రంలో వీటికి ఏ మాత్రం విలువ లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో నియోజకవర్గానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు రూ.34.70 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి 11 నెలల పాలనలో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని.. విద్యతో పాటు వైద్యం, వ్యవసాయరంగాలకు గత ప్రభుత్వానికి మించి మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టారని వివరించారు. రూ.రెండు లక్షల పంట రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశారని.. మిగిలిన వారికి కూడా డిసెంబర్ 9లోపు మాఫీ వర్తింపజేస్తామని చెప్పారు. ఈ నెల 30న పాలమూరులో రైతుసదస్సును ప్రభుత్వం నిర్వహిస్తోందని.. స్టాల్స్ ఏర్పాటుతో పాటు సీడ్స్, ఫర్టిలైజర్, అధునాతన యంత్రాలు రైతులకు ఇవ్వనున్నామని చెప్పారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని.. రైతు సభతో ప్రభుత్వ లక్ష్యం చేరువ చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాగి వేణు, బాబా, యాదయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment