సర్వేలో సమగ్ర వివరాలు సేకరిస్తున్నాం
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఆయా కుటుంబాల పూర్తి వివరాలను సేకరిస్తున్నామని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తెలిపారు. ఆదివారం ఉప ముఽఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ మల్లు రవి ఝార్ఖండ్ రాజధాని రాంచి నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. ఇంటి వద్ద అందుబాటులో లేని, వలసలు వెళ్లిన వారికి ఫోన్ చేసి వివరాలు సేకరిస్తున్నామని, కంప్యూటర్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. సర్వే డాటా ఎంట్రీలో నిబంధనలు పాటిస్తున్నట్లు చెప్పారు. పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో ఆహార కల్తీ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉప ముఖ్యమంత్రి ఆదేశాలను పాటిస్తామన్నారు. మెస్, కాస్మోటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచిందనే విషయాన్ని విద్యార్థులకు వివరిస్తామని.. సంక్షేమ శాఖల అఽధికారులు, గురుకులం, కేజీబీవీ పాఠశాలల నిర్వాహకులతో మాట్లాడటంతో పాటు ఆయా పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ వెల్లడించారు.
అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్
Comments
Please login to add a commentAdd a comment