సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
వనపర్తి: కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన వరిధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ జి. వెంకటేశ్వర్లు ఆదేశించారు. బుధవారం ఏదుల మండలం చెన్నారంలో ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు నాణ్యమైన బియ్యం అందించాల్సి ఉంటుందని.. అందువల్ల నిబంధనల ప్రకారం వరిధాన్యంలో తేమ, తాలు, చెత్త లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం నాణ్యత విషయంలో వ్యవసాయ విస్తీర్ణాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిర్దేశిత మిల్లులకు ఎప్పటికప్పుడు తరలించడంతో పాటు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment