ఆహారం నాణ్యత విషయంలో రాజీ పడొద్దు
వనపర్తి విద్యావిభాగం: గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి భీరం సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర కళాశాల వసతిగృహంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వండి పెట్టె కూరగాయలు ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను మెస్ కమిటీ సభ్యులు తిన్న తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని.. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. బియ్యం లేదా కూరగాయలు బాగో లేకుంటే తిరిగి పంపించాలన్నారు. విద్యార్థులు ప్లేట్లతో పాటు చేతులను శుభ్రంగా కడుక్కునే విధంగా వసతిగృహ అధికారులు, సిబ్బంది పర్యవేక్షించాలని తెలిపారు. స్టాక్ రిజిస్టర్ నిర్వహణ ఖచ్చితంగా పాటించాలన్నారు. వి ద్యార్థుల భోజనం తయారీ, తాగేందుకు ఫిల్టర్ నీరు ఉ పయోగించాలని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాల నాణ్యత విషయంలో తేడా వస్తే బా ధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వసతిగృహ సంక్షేమ అధికారి ఎం.నర్సింహ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment